Cinnamon Coffee
మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ తాగకపోతే చాలామందికి మైండ్ పని చేయదు. బద్ధకాన్ని వదిలించి, ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇచ్చే కాఫీ అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ కాఫీలో మనం యాడ్ చేసే రెగ్యులర్ షుగర్ లేదా ఆర్టిఫిషియల్ క్రీమ్స్ వల్లే అసలు సమస్య అంతా వస్తుంది.
దీనివల్ల పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరిగిపోవడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే కాఫీ టేస్ట్ పోకుండా, హెల్త్‌ని కాపాడుకోవడానికి కాఫీలో షుగర్‌కు బదులు చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపితే చాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలా కాఫీలో దాల్చిన(Cinnamon Coffee) చెక్క పౌడర్ యాడ్ చేయడం వల్ల కాఫీ రుచి, స్మెల్ అద్భుతంగా మారడమే కాక, బాడీకి ఎన్నో బెనిఫిట్స్ దక్కుతాయి. దాల్చిన చెక్కలో చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
ఇవి బాడీలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాపాడతాయి. దీనికి నేచురల్‌గా ఒక స్వీట్ టేస్ట్ ఉండటం వల్ల కాఫీలో ఎక్స్‌ట్రా షుగర్ వేయాల్సిన అవసరమే ఉండదు. దాంతో పంచదార వేసుకుని కాఫీ తాగే అలవాటు మెల్లగా కంట్రోల్ అవుతుంది.
అంతేకాకుండా, కొన్ని పరిశోధనలు చెబుతున్నదాని ప్రకారం.. దాల్చిన చెక్క పొడి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండటానికి, బాడీలో అంతర్గత వాపులు (Inflammation) తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది.
ప్రతీరోజూ ఒక కప్పు కాఫీలో పావు టీస్పూన్ నుంచి హాఫ్ టీస్పూన్ వరకు నాణ్యమైన దాల్చిన చెక్క పొడి కలిపితే సరిపోతుంది.అయితే ఇక్కడ ఒక విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక హెల్దీ హ్యాక్ మాత్రమే, షుగర్ వ్యాధికి పర్మనెంట్ మెడిసిన్ కాదు.
అలాగే దీనిని అతిగా వేస్తే రుచి పాడవడమే కాకుండా లివర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్లు, లివర్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు, బ్లడ్ తిన్నర్ మెడిసిన్ వాడేవారు మాత్రం డాక్టర్ల సలహా తీసుకున్నాకే ఈ కాంబోని ట్రై చేయడం మంచిది.
Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?
