Cool Drinks
సమ్మర్ వచ్చిందంటే చాలు.. సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడానికి అందరూ కూల్ డ్రింక్స్(Cool Drinks) వైపు పరుగులు తీస్తుంటారు. మెయిన్‌గా కూల్ డ్రింక్ తాగుతూ, కరకరలాడే చిప్స్ తినడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.
అయితే, ఈ టేస్టీ కాంబినేషన్ మన ఆరోగ్యానికి ఎంత బ్యాడ్ చేస్తుందో తెలిస్తే షాక్ అవుతాం. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వద్దని.. అలా తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామూలుగా కూల్ డ్రింక్స్(Cool Drinks)లో షుగర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిటిలో కెఫీన్ కూడా ఉంటుంది. ఇవి తాగినప్పుడు అప్పటికప్పుడు దాహం తీరినట్లు అనిపించినా నిజానికి.. ఇవి శరీరాన్ని డీ హైడ్రేషన్ (Dehydration)కు గురి చేస్తాయి. అంటే శరీరంలోని నీటి శాతాన్ని బాగా తగ్గించేస్తాయి.
దీనికి తోడు చిప్స్‌లో ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఉప్పు ఎక్కువైతే దాహం పెరుగుతుంది, దానివల్ల మనం పదేపదే కూల్ డ్రింక్ తాగుతాం. ఇలా బాడీలో షుగర్, సాల్ట్ లెవల్స్ ఒకేసారి పెరగడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
ఈ అలవాటు వల్ల సమ్మర్‌లో తల తిరగడం, నీరసం, బాడీ టెంపరేచర్ కంట్రోల్ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఈ కాంబినేషన్ వల్ల ఒబెసిటీ (Obesity), జీర్ణక్రియలో ఇబ్బందులు, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, యూత్ ఈ జంక్ ఫుడ్ కల్చర్‌కు దూరంగా ఉండటం మంచిది.
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇలాంటి కెమికల్స్ కలిపిన డ్రింక్స్ కంటే సహజమైన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లను ఎంచుకోవడం మంచిది. ఇవి బాడీకి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా చల్లదనాన్ని కూడా ఇస్తాయి. అలాగే చిప్స్‌కు బదులు వేయించిన వేరుశెనగలు, మఖానా , తాజా పండ్లను తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండొచ్చు. ఎప్పుడూ రుచి కంటే ఆరోగ్యానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని గుర్తుంచుకోండి.
PBKS vs DC : పంజాబ్ గెలుపు బాట పట్టేనా ?..ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్
