Forgetfulness
రోడ్డుపై వెళ్తూ సడన్‌గా దారి మర్చిపోవడం, రోజూ వేసుకునే మెడిసిన్స్ టైమింగ్స్ కూడా గుర్తుండకపోవడం, వస్తువు చేతిలో పెట్టుకునే దాని కోసం ఇల్లంతా వెతకడం.. ఇంట్లోని పెద్దవాళ్లలో చాలా కామన్‌గా కనిపించే విషయాలు.
కొంచెం వయసొచ్చాక ఇవన్నీ కామన్ అని చాలామంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ, ఆ నిర్లక్ష్యమే పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంటుందని రీసెర్చర్స్ అంటున్నారు. తాజాగా ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) హైదరాబాద్ సైంటిస్టులు.. వృద్ధుల బ్రెయిన్ హెల్త్‌పై ఒక పవర్‌ఫుల్ స్టడీని బయటపెట్టారు. దీనిలో భాగంగా మతిమరుపు(Forgetfulness) వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఏంటో కూడా తేల్చేశారు.
హైదరాబాద్‌లోని 55 – 85 ఏళ్ల వయసున్న 184 మంది వృద్ధులపై NIN రీసెర్చర్స్ రీసెంట్‌గా ఒక ప్రాక్టికల్ స్టడీ నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన షాకింగ్ నిజం ఏంటంటే.. ప్రతి 100 మంది వృద్ధుల్లో సుమారు 36 మంది మెమరీ పవర్ ప్రాబ్లెమ్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో బాధపడుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పెద్దవాళ్లు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
ఈ జ్ఞాపకశక్తి ప్రాబ్లెమ్‌తో బాధపడుతున్న వారి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించినప్పుడు రీసెర్చర్స్‌కు క్లియర్ క్లూ దొరికింది. వారి బాడీలో మెయిన్‌గా విటమిన్ -డి తో పాటు బి-కాంప్లెక్స్ ఫ్యామిలీకి చెందిన విటమిన్ బి1,విటమిన్ బి2,విటమిన్ బి6,విటమిన్ బి9,విటమిన్ బి12 లెవెల్స్ చాలా దారుణంగా పడిపోయినట్లు గుర్తించారు . వీటిలోనూ మెయిన్‌గా విటమిన్ డి, బి2, బి9 లోపాలు మైండ్ పర్ఫార్మెన్స్‌ని బాగా దెబ్బతీస్తున్నాయని తేలింది.
సాధారణంగా విటమిన్ డి అనగానే మనకు ఎముకలు, దంతాల స్ట్రెంగ్త్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ మనిషి బ్రెయిన్ హెల్దీగా పనిచేయడంలో కూడా ఇది కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఈ రీసెర్చ్‌లో తేలింది. బాడీలో విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, గ్రాస్పింగ్ పవర్, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఉన్నట్లు గుర్తించారు. అలా అని విటమిన్ డి సరిపడా ఉంటే అసలు మతిమరుపు రాదు అనే గ్యారెంటీ కాదు, కానీ విటమిన్- డి కి, బ్రెయిన్ పర్ఫార్మెన్స్‌కి స్ట్రాంగ్ కనెక్షన్ మాత్రం ఉందని సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు.
ఇక నాడీ వ్యవస్థ రీఛార్జ్ అవ్వాలన్నా, బాడీలో ప్రాపర్ ఎనర్జీ జనరేట్ అవ్వాలంటే మాత్రం బి-కాంప్లెక్స్ విటమిన్లు చాలా అవసరం. అధ్యయన సమయంలో విటమిన్ -బి6 విటమిన్- డి లెవెల్స్ బాగున్న వారిలో మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. అంటే, ఏజ్ పెరిగాక బ్రెయిన్ పర్ఫెక్ట్‌గా రీఛార్జ్ అవ్వాలంటే మాత్రం ఫుడ్‌లో ఈ మైక్రో న్యూట్రియెంట్స్ కచ్చితంగా ఉండాలి.
అయితే కేవలం విటమిన్లు తగ్గడం మాత్రమే కాదు..బ్లడ్ ప్రెజర్ (BP), బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారిలోనూ ఈ మతిమరుపు(Forgetfulness) సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే కేవలం న్యూట్రిషన్ మీద మాత్రమే కాకుండా, షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
మతిమరుపు అనగానే చాలామంది భయపడిపోయి అది అల్జీమర్స్ లేదా డిమెన్షియా అనుకుంటారు. కానీ ప్రతి చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం డిమెన్షియా కాకపోవచ్చు. ఏజ్ పెరిగేకొద్దీ నిద్రలేమి, స్ట్రెస్, వాడుతున్న మందులు, దాంతో పాటు న్యూట్రిషన్ లోపాల వల్ల కూడా మతిమరుపు(Forgetfulness) రావొచ్చు. వయసయ్యాక ఆకలి తగ్గడంతో సరిగ్గా తినరు దీంతో బాడీకి కావాల్సిన విటమిన్లు అందవు. అందుకే డైలీ మెనూలో పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
Check Laziness : ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉందా? ఈ 5 జపనీస్ సీక్రెట్ టెక్నిక్స్ ట్రై చేయండి..
