Tablets : టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Tablets : టాబ్లెట్ మింగేటప్పుడు తగినంత వాటర్ తాగకపోవడం వల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట ఏర్పడే ప్రమాదం ఉంది. డాక్టర్లు సూచిస్తున్న సరైన పద్ధతులు, జాగ్రత్తల గురించి అంతా అవగాహన పెంచుకోవాలి.

Tablets

ఏ చిన్నహెల్త్ బాగోకపోయినా డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ వాడతారు. మందులు వేసుకునే విధానం చాలామందికి తెలీక.. పొరపాట్లు చేస్తుంటారు. హడావుడిలో ఉన్నప్పుడో లేదా నీళ్లు తాగడానికి బద్దకం వచ్చినప్పుడో కేవలం ఒక చిన్న గుక్క నీటితోనో, అసలు నీళ్లే లేకుండా డైరెక్ట్‌గా మాత్రలను గొంతులోకి నెట్టేస్తుంటారు. కానీ ఈ చిన్న అలవాటు ఆహార నాళాన్ని, కడుపుని ఏ రేంజ్‌లో దెబ్బతీస్తుందో చాలామందికి అవగాహన ఉండదు.

మనం మింగే టాబ్లెట్(Tablets) లేదా క్యాప్సూల్ ఎప్పుడైనా సరే ఎలాంటి అడ్డు లేకుండా ఈజీగా కడుపులోకి చేరాలి. ఒకవేళ సరిపడా నీరు తాగకపోతే, ఆ టాబ్లెట్ డైరెక్టుగా కిందకి వెళ్లకుండా గొంతులో కానీ ఆహార నాళం మార్గంలో కానీ అతుక్కుపోయే ప్రమాదం ఉంది. మెయిన్‌గా కొన్ని రకాల పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, క్యాల్షియం టాబ్లెట్లు అక్కడ ఉండిపోయినప్పుడు, వాటిలో ఉండే ఘాటైన కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆహార నాళం పొరలలో తీవ్రమైన మంట, చికాకు, వాపు వచ్చి చివరికి పెద్ద పుండ్లు (Ulcers) ఏర్పడతాయి.

మరో ప్రధాన సమస్య ఏమిటంటే, బాడీలో తగినంత వాటర్ లేకపోతే టాబ్లెట్ జీర్ణకోశంలో త్వరగా కరగదు. దీనివల్ల బ్లడ్‌లోకి ఆ మందు శోషించబడే ప్రాసెస్ మందగించి, వ్యాధి త్వరగా తగ్గదు. ముఖ్యంగా వృద్ధులలో, మింగడం ఇబ్బంది ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అందుకే ప్రతిసారీ టాబ్లెట్ వేసుకునేటప్పుడు కనీసం ఒక గ్లాసు నిండా వాటర్ తప్పనిసరిగా తాగాలి.

అలాగే టాబ్లెట్(Tablets) వేసుకున్న వెంటనే పడుకోకూడదు. మెడిసిన్ ఈజీగా కిందకి చేరేలా కనీసం కొద్దిసేపు నిలబడటం కానీ కూర్చోవడం కానీ చేయాలి. మింగడం కష్టంగా ఉందని చాలామంది టాబ్లెట్స్‌ను పొడి చేయడం , సగం ముక్కలుగా కట్ చేయడం చేస్తుంటారు. ఇది మెడిసిన్ పనిచేసే విధానాన్ని మార్చేస్తుంది కాబట్టి డాక్టర్లను అడగకుండా ఇలాంటి పనులు చేయకూడదు.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

↑
Exit mobile version