Coconut Water
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది కొబ్బరి నీళ్ల(Coconut Water )ను తెగ తాగుతారు. ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన పానీయంగా కొబ్బరి నీళ్ల(Coconut Water) గురించి చెబుతారు. విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండే ఈ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఇటీవల అవే కొబ్బరి నీళ్లు ఒక నిండు ప్రాణాన్ని కేవలం 26 గంటల్లోనే బలి తీసుకున్న ఘటన డెన్మార్క్‌లో జరగడంతో మరోసారి కొబ్బరి నీళ్ల గురించి చర్చ నడుస్తోంది.
69 ఏళ్ల ఒక వృద్ధుడు తాజాగా ఉన్న కొబ్బరి నీళ్లు తాగి అనారోగ్యానికి గురై మరణించడం హాట్ టాపిక్ అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. దీని వెనుకున్న కారణం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ కొబ్బరి నీళ్లలో 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ (3-NPA) అనే అత్యంత భయంకరమైన పాయిజన్ ఉందని పరిశోధనలో తేలింది.
అసలు స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లలోకి ఈ విషం ఎలా వచ్చిందన్న విషయాన్ని కూడా నిపుణులు కనుగొన్నారు. కొబ్బరికాయలను కోసిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోతే, మెయిన్‌గా వేడి , తేమ ఎక్కువగా ఉండే చోట ఉంచినప్పుడు, పెంకుపై ఉండే చిన్న చిన్న పగుళ్ల ద్వారా ఒక రకమైన బూజు ( శిలీంధ్రం) లోపలికి ప్రవేశిస్తుంది.
ఇది నీటిలో చేరి 3-NPA అనే విషాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విషం ఎంత శక్తివంతమైనది అంటే, ఇది నేరుగా మన మెదడు , నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఆ వృద్ధుడు నీళ్లు తాగిన మూడు గంటలకే చెమటలు పట్టడం, వాంతులు, కండరాల కదలికలపై కంట్రోల్ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడంతో.. చివరకు బాడీలోని కీలక అవయవాలన్నీ విఫలమై అతను మరణించాడు.
ఈ ఘటనతో అంతా ఇప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం మానేయాలా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా మానేయాల్సిన అవసరం లేదని.. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పుల్లగా ఉన్నా, ఆ నీళ్ల రుచి మారినా, డిఫరెంట్ వాసన వస్తున్నా వెంటనే ఆ నీటిని పారేయండి.
కొబ్బరి బొండం బయటకు తాజాగా ఉన్నా కూడా లోపల విషం ఉండే అవకాశముంది. అందుకే కొబ్బరి కొట్టేటప్పుడు నీళ్లు తెల్లగా, స్వచ్ఛంగా ఉన్నాయో లేదో గమనించాలి. కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు గర్భిణీలు, చిన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు సురక్షితమే ఎందుకంటే వాటిని శుద్ధి (Pasteurization) చేస్తారు.
Secrets :సీక్రెట్స్ పంచుకున్న వాళ్లే చీటర్స్ అవుతున్నారా? ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లతో ఎలా ఉండాలి?
