Jamun Fruit: నేరేడుపండ్లు ఔషధ పండ్లే .. కానీ వారు అస్సలు తినకూడదట..

Jamun Fruit : ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు నేరేడు పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Jamun Fruit

వేసవి కాలంలో నోరూరించే నేరేడు పండ్లు(Jamun Fruit) ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాలుగా చాలా మంది తినడానికి ఇష్టపడతారు . ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే, నేరేడు పండ్లు(Jamun Fruit) అందరికీ అమృతం కావని.. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏయే పరిస్థితుల్లో నేరేడు పండ్లకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం అవసరం అని చెబుతున్నారు.

సాధారణంగా గర్భధారణ సమయంలో స్త్రీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేరేడు పండ్లు తింటే మంచిదని గర్భిణీలు తింటూ ఉంటారు. అయితే వాళ్లు అతిగా తినకూడదని, తిన్నా వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి బాడీలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయని, దీని ద్వారా గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జీర్ణకోశ సమస్యలతో సతమతమయ్యే వారు నేరేడు పండ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఈ పండ్లను తినడం వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడటంతో.. కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Jamun Fruit

అంతేకాదు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులున్నవారు కూడా నేరేడు పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. జలుబు, దగ్గు లేదా ఆస్తమాతో బాధపడేవారు వీటిని తింటే.. శరీరంలో కఫం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇంకా ఎక్కువవుతాయి. ఇలాంటి వారికి నేరేడు పండ్లలోని చలువ చేసే గుణం ప్రతికూలంగా మారుతుంది.

చివరగా, కిడ్నీ సమస్యలున్నవారు నేరేడు పండ్లను తినే ముందు కచ్చితంగా డాక్టరును సంప్రదించాలి. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు నేరేడు పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేరేడులోని కొన్ని మూలకాలు మూత్రపిండాల పనితీరుపై అదనపు ఒత్తిడిని కలిగించి, పరిస్థితిని మరింత క్రిటికల్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ పండ్లను తినే ముందు మీ ఆరోగ్య స్థితిని ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది.

Chennai Super Kings : సంజూ ధనాధన్..చెన్నైకి మరో విజయం

Exit mobile version