Jowar Laddu : స్నాక్స్‌కి బిస్కెట్లు వద్దు.. జొన్న డ్రై ఫ్రూట్స్ లడ్డుతో ఫుల్ ఎనర్జీ

Jowar Laddu : జొన్నల్లోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్‌ను కలిగిస్తే, బెల్లంలోని ఐరన్ బ్లడ్‌ను పెంచుతుంది.

Jowar Laddu

సాయంత్రం అవ్వగానే నాలుక ఏవో చెత్త జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ స్నాక్స్ తినాలని అన్పిస్తుంటుంది. కానీ ఇవి ఆరోగ్యాన్ని నాశనం చేసి, పొట్ట చుట్టూ కొవ్వును పెంచేస్తాయి. కానీ దీనికి బదులు ప్రోటీన్ రిచ్ జొన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు(Jowar Laddu) తింటే హెల్త్‌,టేస్ట్ రుచి దొరుకుతాయి.

జొన్నల్లో ఉండే పీచు పదార్థం, ఐరన్, బి విటమిన్లు , డ్రై ఫ్రూట్స్‌లోని ప్రోటీన్, మంచి కొవ్వులు కలిసి మన బాడీకి ఇన్‌స్టెంట్ స్టామినాని ఇస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం.

జొన్న లడ్డు కోసం 1 కప్పు జొన్న పిండి, 4 – 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, ముప్పావు వంతు కప్పు బెల్లం పొడి, 10 చొప్పున బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, కొద్దిగా వాల్ నట్స్, కొద్దిగా యాలకుల పొడి, అలాగే ఇష్టమున్నవారు గుమ్మడి గింజలు, నువ్వులు వేసుకోవచ్చు.

ముందుగా తక్కువ మంటపై మందపాటి కడాయిలో జొన్న పిండిని వేసి 6 నుంచి 8 నిమిషాలు మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. మరో కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ను కొద్దిగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేగిన జొన్న పిండిలో ఈ డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, బెల్లాన్ని కలపాలి.

Jowar Laddu

తర్వాత తగినంత నెయ్యి పోసి చేతితో బాగా కలిపి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి.ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలి. లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.

ఎక్సర్‌సైజ్‌లు చేసే వారికి, పిల్లలకు, వర్కింగ్ పీపుల్‌కి ఇది బెస్ట్ స్నాక్. జొన్నల్లోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్‌ను కలిగిస్తే, బెల్లంలోని ఐరన్ బ్లడ్‌ను పెంచుతుంది. బయట దొరికే షుగర్ ఉండే స్వీట్లకు బదులు ఇది తీసుకుంటే మంచిది.

Tai Chi Walk : ఫాస్ట్‌గా నడవాల్సిన పనిలేదు.. మైండ్‌,బాడీని రీఛార్జ్ చేసే తాయ్ చి వాకింగ్‌ చేయండి చాలు..

Exit mobile version