Milk : పాలు పదే పదే విరిగిపోతున్నాయా?.. ఎక్కువసేపు నిల్వ ఉంచే బెస్ట్ టిప్స్ ఇవే..

Milk : పాలల్లో యాసిడ్ లెవెల్స్ పెరిగి, ఆ కేసిన్ ప్రోటీన్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి గడ్డలుగా మారిపోతాయి. దాన్నే మనం పాలు విరగడం అంటాం.

Milk

చాలామంది ఇళ్లలో తరచూ ఎదురయ్యే ఒక పెద్ద సమస్య పాలు విరిగిపోవడం అని చెప్పొచ్చు. ఉదయం కొన్న పాలు(Milk) సాయంత్రానికే పుల్లటి వాసన రావడం, స్టవ్ మీద పెట్టి మరిగించగానే ముక్కలు ముక్కలుగా గడ్డలు కట్టడం చూస్తుంటాం. దీనికి మెయిన్ కారణం వాతావరణంలో ఉండే టెంపరేచర్‌లో మార్పులు, అలాగే పాలల్లో సూక్ష్మజీవులు వేగంగా పెరిగిపోవడం.

అసలు పాలు ఎందుకు విరుగుతాయో ప్రాక్టికల్‌గా చెప్పాలంటే .. పాలల్లో(Milk) కేసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. పాలు కొంచెం పులిసినా దానిలోని బ్యాక్టీరియా లాక్టోస్ అనే చక్కెరను లాక్టిక్ యాసిడ్‌గా మార్చేస్తుంది. దీనివల్లే పాలల్లో యాసిడ్ లెవెల్స్ పెరిగి, ఆ కేసిన్ ప్రోటీన్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి గడ్డలుగా మారిపోతాయి. దాన్నే మనం పాలు విరగడం అంటాం.

సాధారణంగా రూమ్ టెంపరేచర్ వద్ద బ్యాక్టీరియా చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. పాలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల అది సూక్ష్మజీవులకు ఒక మంచి ఆహారంలా మారి వాటి సంఖ్యను డబుల్ చేస్తుంది. దీనికి తోడు పాలను తెచ్చిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువసేపు బయటే వదిలేసినపుడు, పాలు పోసే గిన్నెలు, వాడే స్పూన్లు శుభ్రంగా లేకపోయినా పాలు చాలా ఈజీగా పాడైపోతాయి.

అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు పాలు విరిగిపోకుండా జాగ్రత్త పడొచ్చు. మార్కెట్ నుంచి పాలు ఇంటికి తెచ్చిన వెంటనే వీలైనంత త్వరగా మరిగించడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 15 నిమిషాలు అయినా మరిగించాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికర సూక్ష్మజీవులు చనిపోతాయి. పాలు బాగా మరిగాక అవి పూర్తిగా చల్లారే వరకు బయటే ఉంచి, ఆ తర్వాత మూత పెట్టి ఫ్రిజ్‌లో దాచాలి. అలా చేస్తే చల్లటి ఉష్ణోగ్రత వల్ల బ్యాక్టీరియా పెరగకుండా కంట్రోల్ అవుతుంది.

Milk

అలాగే పాలను నిల్వ చేయడానికి ఎప్పుడూ పూర్తిగా తడి లేని,శుభ్రంగా ఉన్న గిన్నెలను మాత్రమే వాడాలి. పాత్రల్లో కొంచెం మురికి కానీ తడి కానీ ఉంటే చాలు పాలు నిమిషాల్లో చెడిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిల్క్‌ను పదే పదే వేడి చేయకూడదు. మీకు ఎంత క్వాంటిటీ పాలు కావాలో అంతే బయటకు తీసి వాడుకుని మిగతావి ఫ్రిజ్‌లోనే ఉంచడం బెస్ట్ ఆప్షన్.

ఒకవేళ పొరపాటున పాలు కనుక విరిగిపోతే కంగారు పడి వాటిని పారేయాల్సిన అవసరం లేదు. స్మెల్ రానంత వరకు ఆ విరిగిన పాలతో పనీర్, లేదా కోవా వంటి స్వీట్ వంటివి తయారు చేసుకోవచ్చు. కానీ పాలు పూర్తిగా కలర్ మారి, బ్యాడ్ స్మెల్ వస్తుంటే మాత్రం వాటిని వాడకపోవడమే మంచిది.

Custard Apple : గుండె జబ్బుల ముప్పును తగ్గించే పండు.. రోగనిరోధక శక్తి పెరగడానికి బెస్ట్ ఫ్రూట్ ఇదే..

Exit mobile version