Ponnaganti Aaku Pachadi : సైట్ ప్రాబ్లెమ్స్‌కి పర్ఫెక్ట్ సొల్యూషన్..టిఫిన్స్, అన్నంలోకి టేస్టీ అండ్ హెల్దీ పొన్నగంటి పచ్చడి రెసిపీ ..

Ponnaganti Aaku Pachadi : పొన్నగంటి ఆకును పచ్చడిగా మాత్రమే కాదు.. ఇగురుగా, వేపుడుగా, పప్పులో వేసి ఎలా అయినా వండుకోవచ్చు.

Ponnaganti Aaku Pachadi

ఇప్పుడు చాలామంది కంప్యూటర్ ముందు వర్క్ వల్ల, మొబైల్ స్క్రీన్లు చూస్తూ కళ్లను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లకు మన పూర్వీకుల కాలం నుంచి అమృతంగా భావించే ఆకుకూర.. పొన్నగంటి ఆకు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు .

విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన పొన్నగంటి ఆకుకూర కంటిచూపును బ్లర్ కాకుండా కాపాడి మంచి చూపును ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ పొన్నగంటి ఆకుతో నోరూరించే రోటి పచ్చడిని మిక్సీలో సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది దోశ, ఇడ్లీ, చపాతీ, వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది.

ముందుగా ఒక కట్ట పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి, సన్నని కాడలతో సహా కట్ చేయాలి. ఈ కాడలు పడేయకూడదు. ఇవే పచ్చడికి అసలైన టేస్ట్‌నిస్తాయి. నీళ్లు లేకుండా ఆకును బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి.

అవి ఒక నిమిషం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1 స్పూన్ ఆయిన్ వేసి, 8-10 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన పొన్నగంటి ఆకు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆకులోని తడి ఆవిరైపోయేలా వేయించడం ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా పప్పులు వేసి మిక్సీలో పొడి చేయాలి. ఆ తర్వాత వేయించిన పొన్నగంటి ఆకు మిశ్రమం, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే చింతపండు నీళ్లు పోసుకోవచ్చు. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది.

Ponnaganti Aaku Pachadi

ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పావు టీ స్పూన్ మెంతిపిండితో పాటు పసుపు, ఇంగువ, కరివేపాకు కూడావేసి వేయించాలి. ఈ పోపులో రెడీ చేసిన పచ్చడిని వేసి ఒక్క నిమిషం పాటు మగ్గనిస్తే నూనెను పీల్చుకుని వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ లైఫ్‌స్టైల్‌లో పడి పాతకాలపు వంటల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలామంది మర్చిపోతున్నారు. పొన్నగంటి ఆకులో విటమిన్ ఎ, బి, సి తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో న్యూట్రియెంట్లు నిండి ఉన్నాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, ఇమ్యూనిటీని పెంచి, శరీరానికి అపరిమితమైన శక్తిని ఇస్తుంది. ఈ ఆకును పచ్చడిగా మాత్రమే కాదు.. ఇగురుగా, వేపుడుగా, పప్పులో వేసి ఎలా అయినా వండుకోవచ్చు.

Two Options In A Relationship : ప్రయారిటీ తేల్చుకోలేని మనుషులు..రిలేషన్‌షిప్‌లో రెండు ఆప్షన్స్‌పై సైకాలజీ ఏం చెబుతోంది?

Exit mobile version