Ragi Kajjikayalu : పిల్లల కోసం స్పెషల్ రెసిపీ.. బలాన్నిచ్చే రాగి కజ్జికాయలు

Ragi Kajjikayalu : రాగి పిండి, బెల్లం, కొబ్బరి కాంబినేషన్‌లో వచ్చే రాగి కజ్జికాయల వంటకం పిల్లలకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం.

Ragi Kajjikayalu

స్కూల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లలకు సాయంత్రం పూట ఏదొక స్నాక్ తినడం అలవాటు ఉంటుంది. అయితే చాలా మంది తల్లిదండ్రులు సమయం లేక బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కొని పెడుతుంటారు. వాటి వల్ల పిల్లల ఆరోగ్యం మన చేతులతో మనమే పాడు చేసినట్లు అవుతుంది.

దానికి బదులు పిల్లలకు ఎంతో రుచిగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి కజ్జికాయలను(Ragi Kajjikayalu) ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయొచ్చు. రాగి పిండి, బెల్లం, కొబ్బరి కాంబినేషన్‌లో వచ్చే ఈ వంటకం పిల్లలకు కొండంత బలాన్ని ఇస్తుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ హెల్దీ స్నాక్ తయారు చేయడానికి ఒక 2 కప్పుల రాగిపిండి తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, తగినంత నూనె , ఒక కప్పు తురిమిన ఎండు కొబ్బరి, తగినంత బెల్లం , కొద్దిగా యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి అవసరమవుతాయి.

ముందుగా కజ్జికాయల లోపల పెట్టే స్టఫింగ్ కోసం.. ఒక గిన్నెలో తురిమిన ఎండు కొబ్బరి, తురిమిన బెల్లం, కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో తగినన్ని నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంట తగ్గించేసి.. రాగిపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టి అలాగే ఉంచాలి.

Ragi Kajjikayalu

ఆ రాగిపిండి ముద్ద కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని పూరీ పిండిలా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని,వాటిని పూరీలలాగా చిన్నగా ఒత్తుకోవాలి.

మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం, కొబ్బరి పొడి మిశ్రమాన్ని అందులో ఉంచి, కజ్జికాయల షేప్‌లో అంచులను గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న కజ్జికాయలను నూనె బాగా మరిగాక దానిలో వేసి రెండు వైపులా మంచిగా కాలేలా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, క్రిస్పీగా ఉండే రాగి కజ్జికాయలు(Ragi Kajjikayalu) రెడీ అయిపోతాయి.

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా?..ఈ 5 రకాల ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త..

Exit mobile version