Sleep : నిద్రపోయే సమయం కాదు.. పడుకునే ముందు ఆ 30 నిమిషాలే ఇంపార్టెంట్ అట..

Sleep : నిద్ర అనేది మన బాడీకి, మెదడుకు జరిగే ఒక సర్వీసింగ్ లాంటిది. రాత్రి పడుకునే ముందు గడిపే ఆ చివరి అరగంట అలవాట్లను మార్చుకుంటే కనుక.. స్లీప్ క్వాలిటీ బాగా పెరుగుతుంది.

Sleep

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర(Sleep) చాలా అవసరమని మనందరికీ తెలుసు. అందుకే చాలా మంది రాత్రి 10 గంటలకో, 11 గంటలకో కచ్చితంగా పడుకోవాలని ఒక టైమ్ ఫిక్స్ చేసుకుంటారు.

అయితే, తాజా హెల్త్ రీసెర్చ్‌లు , ల్యాబ్ రిపోర్టులు ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని బయటపెట్టాయి. మనం ఎన్ని గంటలకు పడుకుంటున్నామనే టైమింగ్ కంటే.. నిద్రపోవడానికి ముందు మనమంతా గడిపే ఆ చివరి 30 నిమిషాలే మనందరి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ను పూర్తిగా డిసైడ్ చేస్తాయట.

నిజానికి ఈ 30 నిమిషాల టైమ్‌ను వైద్య భాషలో గోల్డెన్ విండో లేదా పవర్‌ఫుల్ విండో అని పిలుస్తారు. ఎందుకంటే మనం నిద్రపోవడానికి ముందు ఆ అరగంటలో ఏం ఆలోచించాం.. ఏం చూశామనే విషయాల ఆధారంగానే మెదడు నెక్స్ట్ లెవెల్‌కు షిఫ్ట్ అవుతుందట.

చాలా మంది బెడ్ మీదకు వెళ్లగానే ఫోన్ తీసి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూడటం చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై పడి.. నిద్ర రావడానికి సాయపడే మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ ప్రొడక్టివిటీని పూర్తిగా దెబ్బతీస్తుంది.

దీనివల్ల మనం 8 గంటలు పడుకున్నా సరే.. పొద్దున్నే లేచేసరికి బాడీ వీక్‌గా , బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు ఉండే ఆ ముప్పై నిమిషాల్లో మెదడు ఏ ఇన్ఫర్మేషన్‌ను తీసుకుంటుందో.. నిద్ర(Sleep)పోయిన తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్ దానినే ప్రాసెస్ చేస్తూ ఉంటుంది.

ఈ చివరి అరగంటలో మనందరం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ (Cortisol) లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. పడుకునే ముందు ఆఫీస్ టెన్షన్ల గురించి ఆలోచించడం, మొబైల్‌లో సీరియస్ న్యూస్ చదవడం వల్ల గుండె వేగం పెరిగి, శరీరం అలర్ట్ మోడ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల గాఢ నిద్ర లేదా డీప్ స్లీప్ అనేది అస్సలు దొరకదు.

దీంతో జీర్ణక్రియ మందగించడం, అసిడిటీ రావడం, లాంగ్ టర్మ్‌లో బీపీ, ఒబెసిటీ వంటి తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఎన్ని గంటలు బెడ్ మీద ఉన్నామన్నది పెద్ద విషయం కాదు, ఆ నిద్ర ఎంత క్వాలిటీగా ఉందనేదే ముఖ్యం. కాబట్టి దాన్ని డిసైడ్ చేసేది కేవలం పడుకునే ముందు ఉండే ఆ 30 నిమిషాలే అని అర్థం చేసుకోవాలి.

మరి ఈ గోల్డెన్ టైమ్‌ని మన హెల్త్‌కు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే దానిపై హెల్త్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని సింపుల్ టిప్స్ చెబుతున్నారు. పడుకోవడానికి కచ్చితంగా 30 నిమిషాల ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలను పూర్తిగా పక్కన పెట్టేయాలి . తర్వాత రోజు చేయాల్సిన పనుల గురించి ముందే ఒక చిన్న డైరీలో రాసుకోవడం వల్ల మైండ్ లోడ్ తగ్గి పడుకునే ముందు ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి.

Sleep

ఆ సమయంలో రూమ్‌లో లైట్లు ఆఫ్ చేయడమో లేక బెడ్ ల్యాంప్ ఆన్ చేయడమో చేసి .. మైండ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మనస్సుకు నచ్చిన ఒక మంచి పుస్తకం చదవడం, మెడిటేషన్ చేయడం లేదా కాసేపు దీర్ఘ శ్వాస (Deep Breathing) తీసుకోవడం వల్ల శరీరం త్వరగా నిద్ర(Sleep) మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

నిద్ర అనేది మన బాడీకి, మెదడుకు జరిగే ఒక సర్వీసింగ్ లాంటిది. రాత్రి పడుకునే ముందు గడిపే ఆ చివరి అరగంట అలవాట్లను మార్చుకుంటే కనుక.. స్లీప్ క్వాలిటీ బాగా పెరుగుతుంది. పొద్దున్నే లేచేసరికి విపరీతమైన ఎనర్జీ, రోజంతా మంచి ఫోకస్ మీ సొంతమవుతాయి.

Ireland : సమం చేస్తారా ? సమర్పిస్తారా ?..ఇవాళ ఐర్లాండ్‌తో రెండో టీ ట్వంటీ

Exit mobile version