Chia Seeds : లెమన్, జింజర్, చియా గింజల మ్యాజిక్.. వెయిట్‌లాస్‌తో పాటు ఈ 2 లాభాలు కూడా..

Chia Seeds : నిమ్మకాయ, అల్లం, చియా గింజల కాంబినేషన్‌లో తయారయ్యే ఈ డ్రింక్ కేవలం దాహాన్ని తీర్చడమే కాదు.. మన బాడీకి కావలసిన ఫైబర్, హైడ్రేషన్‌తో పాటు బోలెడన్ని పోషకాలను అందిస్తుంది

Chia Seeds

ఫిబ్రవరి నుంచి ప్రతాపం చూపిస్తున్న మిస్టర్ సూర్యారావు జూన్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో ఈ ఎండల దెబ్బకు బాడీ పూర్తిగా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇలాంటి టైమ్‌లో అందరికీ ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ఇస్తూ, ఒంట్లోని వేడిని తగ్గించే ఒక పవర్‌ఫుల్ అండ్ ట్రెండీ హెల్త్ డ్రింక్..లెమన్ జింజర్ చియా సీడ్(Chia Seeds) డిటాక్స్ డ్రింక్ తెగ వైరల్ అవుతోంది.

నిమ్మకాయ, అల్లం, చియా గింజల(Chia Seeds) కాంబినేషన్‌లో తయారయ్యే ఈ డ్రింక్ కేవలం దాహాన్ని తీర్చడమే కాదు.. మన బాడీకి కావలసిన ఫైబర్, హైడ్రేషన్‌తో పాటు బోలెడన్ని పోషకాలను అందిస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వారికి, బాడీని క్లీన్ చేసుకోవాలనుకునే వారికి ఈ సమ్మర్‌లో ఇదొక బెస్ట్ హెల్దీ ఆప్షన్ అని చెప్పాలి.

ఈ డ్రింక్‌లో వాడే లెమన్ వల్ల మన శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. అలాగే అల్లం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో వేసే చియా గింజలు(Chia Seeds) నీటిని బాగా పీల్చుకుని జెల్ లాగా మారుతాయి. ఇవి మన పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉండేటట్లు చేసి ఆకలిని తగ్గిస్తాయి.

మామూలు నిమ్మరసం తాగితే కేవలం డీ హైడ్రేట్ అవకుండా మాత్రమే ఉంటాం. , కానీ ఈ చియా గింజలు, అల్లం కలిపిన డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల బాడీకి మంచి ఫైబర్, ప్రోటీన్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి అదనపు పోషకాలు కూడా అందుతాయి.

ఈ సూపర్ హెల్దీ డ్రింక్ కోసం రెండు చెంచాల చియా గింజలను ఒక కప్పు నీళ్లలో ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అవి బాగా నానిన తర్వాత ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ రసం, ఒక స్పూన్ అల్లం తురుము, కొద్దిగా పంచదార వేసి, అందులో రెండు కప్పుల వాటర్ పోసి బాగా కలుపుకోవాలి.

Chia Seeds

ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చియా గింజలను కూడా ఈ నీళ్లలో వేసి బాగా తిప్పాలి. చివరగా కొన్ని పుదీనా ఆకులు, ఐస్ ముక్కలు కూడా వేస్తే చల్ల చల్లని డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోతుంది. దీనిని ఇంకాస్త హెల్దీగా మార్చడం కోసం పంచదారకు బదులు ఆర్గానిక్ తేనెను వాడటం, కొద్దిగా నల్ల ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవడం వంటివి చేయొచ్చు.

ఈ డ్రింక్ వల్ల కేవలం 60 క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకున్నవాళ్లు ఉదయాన్నే దీనిని హ్యాపీగా తాగొచ్చు. కేవలం వెయిట్ లాస్ అవడమే కాదు, ఎండకాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన బాడీని కాపాడటానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ నేచురల్ డ్రింక్ ఒక అద్భుతమైన మెడిసిన్‌లా పనిచేస్తుంది.

Oil Prices : గ్లోబల్ మార్కెట్లో మళ్లీ ఆయిల్ ధరల మంట..అమెరికా ఇరాన్ టెన్షన్లతో మారిన సీన్

Exit mobile version