Expiry Tablets
ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ ఏదో ఒక మూలన మెడిసిన్స్‌తో ఉన్న డబ్బా లేదా కవర్ ఉండటం చూస్తుంటాం. ఫీవర్, హెడ్డేక్,బాడీ పెయిన్స్ వంటి చిన్నచిన్న సమస్యలకు అత్యవసరం అయినపుడో లేదంటే ఫార్మసీల చుట్టూ అస్తమానూ ఏం తిరుగుతామనే ఆలోచనతోనో చాలామంది కొన్ని నెలలకు సరిపడా మెడిసిన్‌ను ముందే కొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు.
ఆ తర్వాత ఎప్పుడైన హెల్త్‌లో ఏదైనా తేడా వచ్చినపుడు ఆ బాక్స్‌లోంచి ఆ ట్యాబ్లెట్ తీసి నోట్లో వేసేస్తుంటారు. అలా మింగినపుడు అసలు దానిపై ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా.. ఉంటే ఎప్పటితో గడువు ముగుస్తుందనే విషయాన్ని కనీసం పట్టించుకోరు. తీరా ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్లెవరయినా అది ఎక్స్పైర్ అయినదని చెబితే తెగ కంగారు పడుతూ ఉంటారు. అలా అనవసరమైన టెన్షన్‌తో మెంటల్ టెన్షన్‌కు గురై ఉన్న ఆరోగ్యాన్ని కూడా మరింత పాడు చేసుకుంటుంటారు.
అయితే నిజంగానే అలా ఎక్స్పైరీ అయిన టాబ్లెట్లను(Expiry Tablets), సిరప్‌లను వాడటం వల్ల ప్రాణాంతకమైన సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్ తమ ఎఫెక్ట్‌ను కోల్పోయి వికటించడం వల్ల స్కిన్‌పై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురదలు, చిన్న చిన్న మొటిమలు రావడం వంటి అలర్జీ లక్షణాలు తక్షణమే బయటపడతాయి.
అంతటితోనే ఊరుకోకుండా.. ఊపిరితిత్తులపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తడం అలాగే దాంతో పాటు ఆయాసం భారీగా పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా లేదంటే ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు.. మందులు వాడే ముందు ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అత్యంత కీలకం.
ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే తెలీసీ తెలియక గడువు ముగిసిన సిరప్, టాబ్లెట్స్(Expiry Tablets) తీసుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. ఏ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కూడా ఎక్స్పైరీ అయిన ఉత్పత్తులకు బాధ్యత వహించదు కాబట్టి, మన హెల్త్ పట్ల మనమే అలర్ట్‌గా ఉండాలి.
Elon Musk : గ్రోక్ ఏఐ భారం మోయలేకపోతున్నాం..ఎలాన్ మస్క్ కామెంట్లు దేనికి సంకేతం?
