Weight Loss : తింటూనే బరువు తగ్గొచ్చు.. ఆకలిని అదుపులో ఉంచే 5 బెస్ట్ హెల్దీ స్నాక్స్ ఇవే..

Weight Loss : బాడీకి సరిపడా ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఉండే స్నాక్స్‌ను లిమిట్‌గా తీసుకుంటే ఆకలి కంట్రోల్‌లో ఉండటంతో పాటు డే అంతా పూర్తి ఉత్సాహంగా ఉండొచ్చు.

Weight Loss

వెయిట్ తగ్గాలనుకునే వారు మధ్యలో ఏమీ తినకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉంటే అయితే గ్యాస్‌తో పొట్ట నిండిపోవడం లేదంటే ఆకలి ఎక్కువై, ఆ తర్వాత పూట అవసరానికి మించి తినే ప్రమాదం ఉంటుంది. అందుకే బాడీకి సరిపడా ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఉండే స్నాక్స్‌ను లిమిట్‌గా తీసుకుంటే ఆకలి కంట్రోల్‌లో ఉండటంతో పాటు డే అంతా పూర్తి ఉత్సాహంగా ఉండొచ్చు.

వేయించిన శనగలు వీటినే ఉప్పు శనగలు అంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే కడుపు త్వరగా నిండినట్లు అనిపించి.. మళ్లీ మళ్లీ తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా రోజంతా సమానంగా ఎనర్జీని అందిస్తూ, ప్రయాణాల్లో కూడా హ్యాపీగా తినడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.

Weight Loss

ఇక తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగులో తాజా ఫ్రూట్స్ ముక్కలు కలుపుకుని తింటే బాడీకి ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ అందుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా తీపి పదార్థాలు తినాలనే కోరికను నేచురల్‌గానే తగ్గిస్తుంది.

Weight Loss

మరో మంచి స్నాక్ మఖానా లేదా తామర గింజలు. చాలా తేలికగా ఉండే ఈ మఖానాను కొద్దిగా నూనె లేదా నెయ్యిలో వేయించుకుని తింటే కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఇవి కరకరలాడుతూ భలే రుచిగా ఉండటంతో చాలామంది ఇష్టపడతారు. సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు తినడానికి ఇవి చాలా మంచిది.

Weight Loss

అలాగే యాపిల్ ముక్కలపై కొద్దిగా పీనట్ బటర్ రాసుకుని తిన్నా బాడీకి మంచి ఎనర్జీ లభిస్తుంది. యాపిల్‌లోని ఫైబర్, పీనట్ బటర్‌లోని హెల్దీ ఫ్యాట్స్ కలిసి చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. వర్కవుట్ చేసే ముందు కానీ తర్వాత కానీ తినడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

Weight Loss

పెసలు లేదా శనగల మొలకల్లో టమాటా, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు,బ్లాక్ సాల్డ్, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి సలాడ్‌లా తీసుకుంటే పోషకాల గనిలా బాగా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, విటమిన్లు, ప్రోటీన్ ఎక్కువగా దక్కుతాయి.

Weight Loss

అయితే స్నాక్స్ తినేటపుడు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీరు తినే స్నాక్‌లో ప్రోటీన్ , ఫైబర్ వంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్‌లో వేయించినవి, ఎక్కువ ఉప్పు, షుగర్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన స్నాక్సే కదా అని ఎక్కువగా తినేయకుండా చిన్న కప్పులో మాత్రమే తీసుకోవాలి. రోజు మొత్తంలో సరిపడా నీళ్లు తాగడం కూడా ఆకలిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

వెయిట్ తగ్గే(Weight Loss) జర్నీలో స్నాకింగ్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పని లేదు. సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని, సరైన మోతాదులో తీసుకుంటే ఆకలిని జయించడంతో పాటు వెయిట్‌ను కూడా ఈజీగా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దీనికి తోడు రోజూ కాసేపు వాకింగ్ , ఎక్సర్‌సైజులు, మంచి నిద్ర తోడైతే రిజల్ట్ మరింత వేగంగా ఉంటుంది.

AirPods With Camera : ఆపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. చెవులకు కెమెరాలు పెడుతున్న ఆపిల్..

Exit mobile version