Ambani VS Musk : ఇండియన్ టెలికాం మార్కెట్‌లో పెరిగిన హీట్..సై అంటే సై అంటున్న జియో, స్టార్‌లింక్..

Ambani VS Musk : భారత శాటిలైట్ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ విషయంలో ఇన్నాళ్లూ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్ మధ్య ఓ రేంజ్‌లో కోల్డ్ వార్ నడిచింది.

Ambani VS Musk

భారతీయ టెలికాం సెక్టార్‌లో కొన్ని రోజులుగా నడుస్తున్న బిగ్ శాటిలైట్ డ్రామాకి ఫైనల్‌గా మతి పోయే ట్విస్ట్ పడింది. ఇండియన్ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్న ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్‌లింక్.. భారత్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి తమ వైపు నుంచి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తాజాగా ప్రకటన చేసింది.

అయితే ఇన్నాళ్లూ హోరాహోరీగా సాగిన వార్‌కి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్క స్టేట్‌మెంట్‌తో కొత్త కలరింగ్ ఇవ్వగా, దానికి ఎలాన్ మస్క్(Ambani VS Musk) ఇచ్చిన కౌంటర్ రియాక్షన్ గ్లోబల్ బిజినెస్ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది.

భారత శాటిలైట్ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ విషయంలో ఇన్నాళ్లూ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్(Ambani VS Musk) మధ్య ఓ రేంజ్‌లో కోల్డ్ వార్ నడిచింది. ఇండియన్ మార్కెట్‌లో ఓన్‌గా సీన్ క్రియేట్ చేయడానికి ముకేశ్ అంబానీ ట్రై చేస్తున్నారని మస్క్ గతంలో ఇన్ డైరెక్ట్ సెటైర్లు కూడా వేశారు.

అయితే సీన్ కట్ చేస్తే.. రిలయన్స్ మేనేజ్‌మెంట్ ఒక్కసారిగా రూట్ మార్చింది. దేశీయ చట్టాలకు లోబడి వర్క్ చేసేటప్పుడు ఫారిన్ దిగ్గజమైనా, స్వదేశీ కంపెనీ అయినా హెల్దీ కాంపిటీషన్‌ను స్వాగతిస్తామని ఓపెన్‌గా అనౌన్స్ చేసిన రిలయన్స్.. తమ జియో శాటిలైట్ నెట్‌వర్క్ కూడా ఫైనల్ పర్మిషన్ల కోసం లైన్‌లోనే ఉందని క్లారిటీ ఇచ్చింది.

రిలయన్స్ నుంచి ఇలా ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. స్టార్‌లింక్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి.. ఐదేళ్లుగా భారత టెలికాం కండీషన్లు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక గ్రౌండ్ స్టేషన్లు, డేటా గేట్‌వేలను పక్కాగా నిర్మించామని క్లారిటీ ఇచ్చింది.

ఇక మౌలిక వసతులు పర్ఫెక్ట్‌గా ఉన్నాయని తెలీడంతో, ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి కమర్షియల్ రోలౌట్‌కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన లాస్ట్ డిఫెన్స్ క్లియరెన్సెస్ రాగానే, దేశంలోని చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా నెట్ స్పీడ్ నయా రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతుంది.

Slow Dating : డేటింగ్ యాప్‌ల కల్చర్‌కు చెక్.. ట్రెండ్‌లో స్లో డేటింగ్

↑
Exit mobile version