Balochistan : పాకిస్థాన్ ప్రభుత్వానికి భారీ షాక్.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్

Balochistan : 1947లో భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్‌లోని కలాత్ ఖనాట్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్తాన్ దీనిని బలవంతంగా తనలో విలీనం చేసుకుంది.

Balochistan

బలూచిస్తాన్ ఉద్యమకారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చారు. బెలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. దశాబ్దాలుగా పాక్ అణిచివేతను నిరసిస్తూ సాయుధ పోరాటం చేస్తున్న అక్కడి విప్లవకారుల తాజా ప్రకటన సంచలనమనే చెప్పాలి. భౌగోళికంగా పాకిస్థాన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన ఈ ప్రాంతంలో దాదాపు 85 శాతం భూభాగం తమ బలగాల ఆధీనంలోనే ఉందని ఉద్యమకారులు ప్రకటించారు.

ఈ చారిత్రాత్మక ప్రకటనతో పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. 1947లో భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్‌లోని కలాత్ ఖనాట్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్తాన్ దీనిని బలవంతంగా తనలో విలీనం చేసుకుంది. అప్పటి నుంచే బలూచిస్తాన్ లో చాలా మంది దీనిని నిరసిస్తున్నారు.

బలూచిస్తాన్(Balochistan) సహజ వాయువు , ఖనిజ సంపద, బంగారం నిల్వలతో అత్యంత సంపన్నమైన ప్రాంతంగా ఉంది. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఈ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ఈ క్రమంలో పాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ చాలా మంది ఆరోపించారు. తమ హక్కుల గురించి ప్రశ్నించే మేధావులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలను పాకిస్తాన్ బలగాలు అపహరిస్తున్నాయని, వారి ఆచూకీ లభించడం లేదని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి.

వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన గ్వాదర్ పోర్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల స్థానిక బలూచ్ ప్రజల జీవనానికి ముప్పు వాటిల్లుతోందని, లాభాలు మాత్రం తమకు కాకుండా చైనా, పాక్ పాలకులకే వెళ్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం రాజకీయ , ఆర్థిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే బదులు, సైనిక బలగాలను ఉపయోగించి ఉద్యమాలను క్రూరంగా అణచివేస్తుందనే భావన అక్కడి ప్రజల్లో బలంగా ఉంది.

Balochistan

బలూచిస్తాన్(Balochistan) లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ గ్రూపులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. తాజాగా స్వతంత్ర దేశంగా ప్రకటన చేయడమే కాకుండా మా సుకైన్ బలోచని పేరుతో సరికొత్త జాతీయ గీతాన్ని, ప్రత్యేక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా, తమ దేశ అధికారిక కరెన్సీగా బలోచి పాలస్‌ను ఖరారు చేశారు. తమ భూభాగంలో ఉన్న అపారమైన బంగారం, రాగి గనులు, సహజ వాయువు క్షేత్రాలు, బొగ్గు గనులపై ఇకపై తమ నియంత్రణే ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

Swiggy Instamart : ఇకపై నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. నయా సేవలను మొదలుపెట్టిన స్విగ్గీ

Exit mobile version