Iran
అమెరికా, ఇరాన్ యుద్ధం రానున్న రెండు మూడు వారాల్లో భీకర స్థాయికి చేరుకుంటుందా…అవుననే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్… ఇరాన్ పై యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకుంటున్న ట్రంప్ తాజాగా వైట్ హౌస్ నుంచి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
2-3 వారాల్లో భీకర దాడులు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్(Iran) కు చెందిన నేవీ, ఎయిర్ పోర్స్ ను నాశనం చేసామంటూ చెప్పుకొచ్చారు. పలువురు కీలక నేతలను కూడా మట్టుపెట్టామంటూ ప్రకటించారు. ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో తామే పైచేయి సాధించామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ తమ షరతులకు అంగీకరించి యుద్ధం ముగించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇరాన్ తమ డీల్ కు ఒప్పుకోకుంటే ఎలక్ట్రిక్ జనరేషన్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తమకి హర్మూజ్ నుంచి ఇంధనం అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏ దేశాలకు ఇంధనం కావాలన్నా హర్మూజ్ సంధి నుంచి తెచ్చుకోవచ్చని, లేదంటే తమ నుంచి కొనుగోలు చేయాలంటూ ట్రంప్ సూచించారు.
అమెరికా తన లక్ష్యాలను దాదాపుగా పూర్తి చేసిందని.. యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తామని ట్రంప్ చెప్పారు. అయితే వచ్చే 2, 3 వారాల పాటు మాత్రం ఇరాన్‌పై దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు, అలాగే ప్రపంచ దేశాలన్నీ కలిసి హార్మూజ్ జలసంధిని ఇరాన్ గుప్పిట్లో నుంచి విడిపించాలని పిలుపునిచ్చారు.
ఈ యుద్ధం అమెరికా భద్రతకు ఎందుకు అవసరమో వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసే స్థాయికి వెళ్లిందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలే ఈ రోజు అమెరికాను యుద్ధంలో విజేతగా నిలిపాయన్నారు. తన దూకుడైన నిర్ణయాలే ఈ విజయానికి కారణమంటూ ట్రంప్ చేసిన వాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా పొరుగు దేశాలకు కూడా ట్రంప్ కొన్ని సూచనలు చేశారు. ఇరాన్ ఇకపై బయటి దేశాలను భయపెట్టే స్థితిలో లేదని ట్రంప్ భరోసా ఇచ్చారు.
