Foldable IPhone : యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో నియా.. క్షణాల్లోనే స్టాక్ ఖాళీ

Foldable IPhone : యాపిల్ నుంచి ఫస్ట్ టైమ్ మార్కెట్లోకి వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయో టెక్ ప్రపంచంలో అంచనాలను తలకిందులు చేస్తూ క్రేజీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

Foldable IPhone

గ్లోబల్ మార్కెట్‌లో టెక్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ అద్భుతం వచ్చేసింది. టెక్ దిగ్గజం యాపిల్ నుంచి ఫస్ట్ టైమ్ మార్కెట్లోకి వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్(Foldable IPhone) డ్యుయో టెక్ ప్రపంచంలో అంచనాలను తలకిందులు చేస్తూ క్రేజీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అక్టోబర్ 16వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రీ-ఆర్డర్లు స్టార్ట్ అయిన క్షణాలలోనే ఫస్ట్ బ్యాచ్ స్టాక్ టోటల్ సేల్ అయిపోయింది. డిమాండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్లకు డెలివరీ డేట్స్ .. 2027 జనవరి లేదా ఫిబ్రవరి వరకు చూపిస్తున్నాయి.

ఇటు ఇండియన్ మార్కెట్‌లోనూ ఐఫోన్ డ్యుయో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు. ప్రీబుకింగ్స్ ఓపెన్ అయిన ఫస్ట్ రోజే దేశంలోని యాపిల్ స్టోర్లలో పిక్ అప్ స్లాట్లన్నీ క్షణాల్లోనే ఫిల్ అయిపోయాయి. ఈ మంత్ 23 నుంచి ఈ ఫోన్ డైరెక్ట్‌గా స్టోర్లలో సేల్‌కి రాబోతోంది. ఇక కాస్ట్ విషయానికొస్తే.. బేసిక్ 256GB మోడల్ ఏకంగా రూ. 2,99,900 ఉండగా, 512GB రూ. 3,24,900, 1TB వేరియంట్ రూ. 3,74,900, ఇక టాప్ఎండ్ 2TB మోడల్ ధర రూ. 4,49,900గా ఉంది.

లుక్స్ అండ్ ఫీచర్స్ పరంగా చూస్తే.. స్టార్ వైట్, నైట్ స్కై కలర్ ఆప్షన్లలో ఇది అద్దిరిపోయింది. ఫోన్ క్లోజ్ చేసినప్పుడు 5.4 ఇంచెస్ ఔటర్ స్క్రీన్, ఓపెన్ చేస్తే ఏకంగా 7.6 ఇంచెస్ ఇన్నర్ సూపర్ రెటీనా డిస్‌ప్లేతో సూపర్ లుక్‌తో కనిపిస్తుంది. యాపిల్ ఓన్లీ పర్పస్ కోసం సిద్ధం చేసిన పవర్‌ఫుల్ ఏ20 ప్రో చిప్‌సెట్, లేటెస్ట్ ఐఓఎస్ 27 సాఫ్ట్‌వేర్‌పై ఇది రన్ అవుతుంది.

దీంట్లో నార్మల్ సిమ్ సపోర్ట్ లేదు. ఓన్లీ ఈ సిమ్ మాత్రమే వర్క్ చేస్తుంది. దీనికి తోడు బయ్యర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఇవ్వడం ఈ సేల్స్‌ మరింత పెరిగేలా చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రైస్ లక్షల్లో ఉన్నాసరే, యాపిల్ క్రేజ్ ఏంటో ఈ ఫోన్ మళ్లీ ప్రూవ్ చేసింది.

Ambani VS Musk : ఇండియన్ టెలికాం మార్కెట్‌లో పెరిగిన హీట్..సై అంటే సై అంటున్న జియో, స్టార్‌లింక్..

↑
Exit mobile version