H-1B Visa : హెచ్-1బీ వీసాపై మళ్లీ లక్ష డాలర్ల అదనపు ఫీజు..ఫెడరల్ కోర్టు తీర్పుపై స్టే

H-1B Visa : ఇటీవల ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ భారీ ఫీజును చట్టవిరుద్ధమంటూ కొట్టివేసినా.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల వల్ల మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఈ చార్జీని మళ్లీ పునరుద్ధరించింది.

H-1B Visa

అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించి స్థిరపడాలని కలలు కనే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ సర్కార్ గట్టి విఘాతం కలిగించింది.

హెచ్-1బీ వీసా(H-1B Visa)లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన అత్యంత వివాదాస్పద లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 90 లక్షల రూపాయలకు పైగా అదనపు రుసుము టెంపరరీగా మళ్లీ అమల్లోకి వచ్చింది.

ఇటీవల ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ భారీ ఫీజును చట్టవిరుద్ధమంటూ కొట్టివేసినా.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల వల్ల మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఈ చార్జీని మళ్లీ పునరుద్ధరించింది.

ఈ ఫీజు క్యాన్సిల్ అంటూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడంతో, కోర్టు స్టే మంజూరు చేసింది. దీనివల్ల యూఎస్ వీసాపై ఆధారపడే ఐటీ కంపెనీల యాజమాన్యాలతో పాటు విదేశీ నిపుణులు మళ్లీ తీవ్ర అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అమెరికా స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను రక్షిస్తామంటూ చెబుతూ, హెచ్-1బీ(H-1B Visa) లాటరీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు లక్ష డాలర్ల స్పెషల్ ఫీజు చెల్లించాల్సిందేనంటూ 2025 సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఒక కఠినమైన ఆదేశాన్ని జారీ చేయడంతో ఈ వివాదం మొదలైంది.

అయితే ఇంత భారీ మొత్తంలో రుసుములు విధించడాన్ని తప్పుబడుతూ కొన్ని ఐటీ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఫెడరల్ జిల్లా కోర్టు, జూన్ 8 న ఈ అదనపు ఫీజును పూర్తిగా చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఐటీ రంగానికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

ఈ అదనపు వసూళ్లు కేవలం ఒక ఫీజు పరిధిలోకి రావని, ఇదొక పన్ను వంటిదని, సరైన చట్టపరమైన అధికారం లేకుండా ఇలాంటి రుసుములు విధించడం కుదరదని కోర్టు క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ కోర్టు తీర్పుతో ఆనందపడ్డ ఐటీ కంపెనీల సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం వెంటనే అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన మసాచుసెట్స్ జిల్లా కోర్టు, పాత తీర్పుపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలను ఇచ్చింది.

H-1B Visa

ప్రభుత్వ అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో, అమెరికా పౌరసత్వం , వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ఈ లక్ష డాలర్ల ఫీజును టెంపరరీగా వసూలు చేసుకోవచ్చని అనుమతించింది.

కాన్సులర్ నోటిఫికేషన్ ద్వారా దాఖలు చేసే కొన్ని స్పెషల్ పిటిషన్లకు ఈ ఫీజు రూల్ వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.ఈ తీర్పు వల్ల నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులపై ఆధారపడిన గ్లోబల్ కంపెనీలపై మోయలేని ఆర్థిక భారం పడబోతోంది.

Indian Scientist : 14 ఏళ్ల యుద్ధం.. సిస్టమ్‌ని షేక్ చేసిన ఇండియన్ సైంటిస్ట్ కథ!

Exit mobile version