Trump
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇరాన్‌పై భీకరమైన దాడులతో అమెరికా విరుచుకుపడుతుంటే దానికి దీటుగానే ఇరాన్ కూడా సమాధానమిస్తోంది. అదే సమయంలో తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ఎంతగానో ఎదురుచూస్తోంది.
దీనిలో భాగంగానే ట్రంప్ హత్యకు ఇరాన్ మిలిటెంట్లు కుట్రలు పన్నుతున్నారన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అటు ఖమేనీ కుమారుడు సైతం తన తండ్రి హత్యకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్‌ను అంతమొందించడానికి ఇరాన్ పెద్ద ప్లానే వేస్తుందన్న విషయం కూడా అమెరికా భద్రతా సంస్థలకు అర్థమైంది.
ఇరాన్ ఏ స్థాయిలో పగతో రగిలిపోతుందనేది టెహ్రాన్ నగరం నడిబొడ్డున మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా వెలిసిన బ్యానర్లను చూస్తే అర్థం చేసుకోవచ్చు. రక్తానికి రక్తం అంటూ ట్రంప్ , ఆయన కుటుంబసభ్యుల ఫోటోలతో కూడిన శవపేటికలతో భారీ బ్యానర్ అందరినీ షాక్ కొట్టేలా చేస్తుంది.
అమెరికా జెండాతో కప్పబడిన శవపేటికల్లో ట్రంప్ భార్య మెలానియా, ఆయన ఐదుగురు పిల్లలు (ఇవాంకా, టిఫనీ, బారన్, డొనాల్డ్ జూనియర్, ఎరిక్) ఉన్నట్లుగా ఈ బ్యానర్లను రూపొందించారు. వీటిపై ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో బ్లడ్ ఫర్ బ్లడ్ అని రాసి ఉంది.
మరో హోర్డింగ్‌లో ట్రంప్(Trump)ను బహిరంగ నల్ల శవపేటికలో పడుకోబెట్టి ట్రంప్‌ను చంపుతామనే నినాదాలను ప్రదర్శించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగానే ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక బిల్‌బోర్డ్‌పై ఇరాన్.. అమెరికా అధ్యక్షుడి ట్రంప్‌ని బెదిరించడం ఇది రెండోసారి.
గత వారం ట్రంప్ శవపేటికలో పడుకుని ఉన్న చిత్రాన్ని చూపిస్తూ హోర్డింగ్ ఏర్పాటు చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి భారీ హోర్డింగ్‌లను టెహ్రాన్‌లోని అత్యంత రద్దీగా , అందరికీ కనిపించే కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఒకవేళ ఇరాన్ తనను హతమార్చడంలో సఫలమైతే, భారీ స్థాయిలో బాంబు దాడులు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, తాను చాలా కాలంగా ఇరాన్ హిట్ జాబితాలో ఉన్నానని చెప్పారు. కాగా ఇటీవల ఖమేనీ అంత్యక్రియల సమయంలోనూ ఇరాన్ ట్రంప్(Trump)కు వార్నింగ్ ఇచ్చింది. ఎట్టిపరిస్థితిల్లోనూ ట్రంప్‌ను లేపేస్తామంటూ ఆ దేశ మిలిటెంట్ గ్రూపులు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నాయి.
Ration Card : ఒకే ఇంట్లో రెండు రేషన్ కార్డులు సాధ్యమేనా?.. రూల్స్ ఏం చెబుతున్నాయి?
