Morocco : సరిహద్దుల్లో వలసల వరద.. మొరాకో,స్పెయిన్ గొడవేంటి ?

Morocco : జూలై 30న మొరాకో రాజు మొహమ్మద్-VI పట్టాభిషేక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది చిన్న చిన్న నేరస్థులకు క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేశారు.

Morocco

మొరాకో, స్పెయిన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా తీవ్ర అలజడి నెలకొంది. వేలాది మంది వలసదారులు హఠాత్తుగా మొరాకో నుంచి స్పెయిన్ భూభాగంలోకి అక్రమంగా చొరబడడమే ఈ అలజడికి కారణం. కేవలం రెండు రోజుల్లోనే 60 వేల మందికి పైగా వలసదారులు సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

సముద్రం ద్వారా ఈదుకుంటూ, సరిహద్దుల్లో ఐరెన్ రక్షణ కంచెలను దాటుకుంటూ రావడానికి ప్రయత్నించే సమయంలో మృతి చెందారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల వెనుక కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. మొరాకో(Morocco) రాజు పెట్టిన క్షమాభిక్షతో పాటు ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

జూలై 30న మొరాకో(Morocco) రాజు మొహమ్మద్-VI పట్టాభిషేక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది చిన్న చిన్న నేరస్థులకు క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేశారు. ఇలా విడుదలైన వారు ఉపాధి కోసం వెంటనే పక్కనే ఉన్న స్పెయిన్ సరిహద్దుల్లోకి చొరబడ్డారని స్థానిక ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో జైళ్ల అధికారులే సరిహద్దు దగ్గర వారిని తీసుకొచ్చి వదిలేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు లేవు.

మరోవైపు సముద్ర మార్గం ద్వారా సెయూటా, మెలిల్లా నగరాలకు వచ్చే వలసదారుల విషయంలో స్పెయిన్ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. అలాంటి వలసదారులను చట్టపరమైన విచారణ లేకుండా మొరాకోకు వెంటనే వెనక్కి పంపకూడదని గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టు తీర్పు మొరాకో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

దీంతో స్పెయిన్ రక్షణ బలగాలు తమను వెంటనే వెనక్కి పంపలేరనే నమ్మకంతో వలసదారులు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నా సరే.. సెయూటా, మెలిల్లా నగరాలు స్పెయిన్ అధీనంలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి ఉన్న ఏకైక భూ సరిహద్దు మార్గం ఇదే కావడంతో వలసదారులు దీనినే ఎంచుకుంటున్నారు.

Morocco

గతంలో కూడా దౌత్యపరమైన విభేదాలు వచ్చినప్పుడు మొరాకో ప్రభుత్వం తన సరిహద్దు భద్రతను ఉద్దేశపూర్వకంగా సడలించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం మొరాకో అధికారులు కంచెల వద్ద నిఘా తగ్గించేశారన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే భారీ చొరబాట్లు జరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా మొరాకో యువతలో నిరుద్యోగ శాతం బాగా పెరిగిపోయింది. దీంతో ఉపాధి కోసం యూరప్ వెళ్లడానికి అక్కడి యువత ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో భారీ ఎత్తున స్పెయిన్ భద్రతా సిబ్బందిని మొహరించారు.

Vitamin D : ఎగ్ తినడానికి ఓ లెక్కుందట.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తున్నారేమో చూడండి..

Exit mobile version