Nepal : భారత్, చైనా ఆఫర్లు రిజెక్ట్ ..నేపాల్ సంచలన నిర్ణయానికి రీజన్‌ ఏంటి?

Nepal : పొరుగున ఉన్న భారత్, చైనాలతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాలు పంపిన అత్యవసర సహాయ ప్రతిపాదనలను నేపాల్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

Nepal

హఠాత్ జలప్రళయంతో అతలాకుతలమై కోలుకోలేని విషాదంలో మునిగిపోయిన హిమాలయ పర్వత ప్రాంత దేశం నేపాల్ ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. వరద ఉధృతికి గల్లంతైన వేలాది మంది కోసం విపరీతంగా కొనసాగుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో.. విదేశీ రెస్క్యూ టీమ్‌ల సాయాన్ని తీసుకోకూడదని నిశ్చయించుకుంది.

తమ దేశ స్వంత భద్రతా బలగాలే ప్రతి పరిస్థితినీ దీటుగా ఎదుర్కొని సహాయక చర్యలు పూర్తి చేయగలవని నేపాల్ భావిస్తోంది. పొరుగున ఉన్న భారత్, చైనాలతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాలు పంపిన అత్యవసర సహాయ ప్రతిపాదనలను నేపాల్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

ఆగస్ట్ 26 బుధవారం భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మట్టి ప్రవాహాలు, వినాశకరమైన వరద నీరు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో మెయిన్‌గా నేపాల్-చైనా సరిహద్దు జిల్లాల్లో టన్నుల కొద్దీ మట్టి, కొండచరియల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం డే అండ్ నైట్ గాలింపు సాగుతోంది.

ఈ విపత్తులో ఇప్పటివరకు భారతీయులతో సహా ఏకంగా 469 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వేలాది మంది ఆచూకీ దొరక్కకుండా పోయారని అధికారులు చెబుతున్నారు. దీంతో పరిస్థితి తీవ్రతను చూసి భారతదేశం, చైనా, అమెరికా,జపాన్, బ్రిటన్, శ్రీలంక, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించడానికి ముందుకొచ్చాయి.

వందలాది మంది ఇండియన్స్ ఆచూకీ తెలియకుండా పోవడంతో భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) టీమ్‌ను అక్కడికి పంపడానికి కేంద్రం అనుమతి కోరినా కూడా, నేపాల్ దానిని రిజెక్ట్ చేసింది.

అయితే ఇంత పెద్ద ఎత్తున జరిగిన విపత్తులో కూడా నేపాల్ విదేశీ బలగాలను వద్దనడానికి బలమైన కారణమే ఉంది. గతంలో 2015లో సంభవించిన భయంకరమైన భూకంపం సమయంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఫారిన్ రెస్క్యూ బృందాలు నేపాల్‌లోకి రావడం వల్ల లాజిస్టిక్స్, సమన్వయం , క్షేత్రస్థాయి నిర్వహణ వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి.

ఆ పాత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ డెసిషన్ తీసుకున్నట్లు నేపాల్(Nepal) అధికారులు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో విదేశీ బలగాలను మోహరించడం కంటే, అవసరమైన ఆర్థిక సాయాన్ని ఒకే ఒక సెంట్రల్ సిస్టమ్ ద్వారా అందించాలని ఆ దేశం కోరుతోంది. ఇప్పటికే నేపాల్ పోలీసులు 4,348 మంది రెస్క్యూ ఆపరేషన్లలో బిజీ అయ్యారు. ఇప్పటివరకు రసువా నుంచి 644 మందిని, నువాకోట్ నుంచి 898 మందిని, ధాదింగ్ నుంచి ముగ్గురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడగలిగింది.

అయితే గల్లంతైన వారిలో కేవలం స్థానికులే కాకుండా పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా ఉన్నారు. అందులో 200 మందికి పైగా భారతీయులు, 65 మంది అమెరికన్లు, 53 మంది ఉక్రెయిన్ వాసులు, 51 మంది మలేషియన్లు, 33 మంది బ్రిటన్ వాసులు, 35 మంది ఆస్ట్రేలియన్లు , 25 మంది కెనడా పౌరుల ఆచూకీ ఇంకా లభించలేదు.

Nepal

ఫిజికల్ రెస్క్యూ టీమ్‌లను అడ్డుకున్నా, ఆర్థిక , మానవతా కోణంలో వచ్చే సాయాన్ని మాత్రం నేపాల్ స్వీకరిస్తోంది. ఈ విపత్తుపై స్పందించిన అమెరికా ఇప్పటికే 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర మెడికల్ సామాగ్రిని పంపింది. విదేశీ పౌరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను కూడా స్టార్ట్ చేసింది.

భారత్ కూడా తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ రెండు ఫ్లైట్స్ ద్వారా మొత్తం 47.5 టన్నుల హెచ్‌ఏడీఆర్ (HADR – హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్) అత్యవసర సాయాన్ని అందజేసింది.

ఆగస్టు 26న మొదటి ఫ్లైట్‌లో 10 టన్నులు, ఆగస్టు 27న రెండో ఫ్లైట్‌లో 37.5 టన్నుల నిత్యావసరాలను తరలించింది. ఈ ప్యాకేజీలో బాధిత ప్రజల కోసం అత్యవసర మందులు, ఆహార ప్యాకెట్లు, టెంపరరీ షెల్టర్లు, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంప్‌లతో పాటు వాటర్ బాటిల్స్‌ను పంపించింది.

Postal Job : ఎగ్జామ్ లేదు..టెన్త్ మార్కులతోనే సెలెక్షన్..తపాలా శాఖలో జీడీఎస్ ఉద్యోగాలు..

Exit mobile version