Netanyahu : ట్రంప్ డీల్‌పై ఇజ్రాయిల్ గరంగరం.. ఇరాన్‌ను వదలనంటున్న నెతన్యాహు

Netanyahu : నెతన్యాహు ప్రకటనతో ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా యుద్ధం విషయంలో ట్రంప్, నెతన్యాహు అభిప్రాయాలు వేరని తేలిపోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు

Netanyahu

ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ముగిసిపోయిందని ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకుంటే ఇజ్రాయెల్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి యుద్ధంలో ముందుకెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పుడు రగిలిపోతున్నారు. ఇరాన్ పై తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు.

ట్రంప్ డీల్ పై మాట్లాడని నెతన్యాహు(Netanyahu) ఇరాన్ కు మాత్రం పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తో అణు ఒప్పందం కుదిరినా లేకున్నా వారి దగ్గర అణ్వాయుధాలు ఉండడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని తేల్చి చెప్పారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతవరకూ దీనికే కట్టుబడి ఉంటామన్నారు.

దీంతో ఇరాన్ పై దాడులు ఆపేది లేదని నెతన్యాహు తేల్చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా భీకర దాడులు కొనసాగించబోతున్నట్టు ప్రకటించారు. నిజానికి ఇరాన్ తో శాంతి చర్చలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన తర్వాత నెతన్యాహు(Netanyahu) దానిని వ్యతిరేకిస్తునే ఉన్నారు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది.

ఇజ్రాయెల్‌ ను నాశనం చేయాలనుకున్న అణు ముప్పు నుంచి తమ దేశాన్ని కాపాడుకున్నామన్నారు. ఇరాన్, లెబనాన్ ను విడిచిపెట్టాలంటూ సూచించారు.ఈ సందర్భంగా శాంతి ఒప్పందంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఎలాంటి శాంతి ఒప్పందాలు కూడా ఇజ్రాయెల్ ను ఆపలేవనీ, ఇరాన్, లెబనాన్ లపై దాడులు కొనసాగుతాయన్నారు.

ట్రంప్‌ చేసుకున్న శాంతి ఒప్పందాన్ని తాను విభేదిస్తున్నానంటూ నెతన్యాహు(Netanyahu) కుండబద్ధలు కొట్టారు. దీనికి పలు కారణాలను కూడా వెల్లడించారు. అణ్వాయుధాలు తయారు చేయమనీ, యూరేనియం నిల్వలు అప్పగిస్తామన్న అంశాలపై ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. దీనిపై త్వరలో జరిగే చర్చలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Netanyahu

అయితే ఇజ్రాయెల్ దేశ రక్షణను ఎవరి చేతుల్లోనూ పెట్టేందుకు మాత్రం తాను సిద్ధంగా లేనని నెతన్యాహు తెలిపారు. నెతన్యాహు ప్రకటనతో ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా యుద్ధం విషయంలో ట్రంప్, నెతన్యాహు అభిప్రాయాలు వేరని తేలిపోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇరాన్ కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లించనుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ విషయాలను ట్రూత్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఇరాన్ విషయంలో ట్రంప్- నెతన్యాహు వైఖరి భిన్నంగా ఉంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో మళ్లీ ఏ క్షణమైనా యుద్ధ సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్..సినిమా లింకులు, గోవా సీక్రెట్స్

Exit mobile version