Oil Prices : గ్లోబల్ మార్కెట్లో మళ్లీ ఆయిల్ ధరల మంట..అమెరికా ఇరాన్ టెన్షన్లతో మారిన సీన్

Oil Prices : ఇరాన్ క్షిపణి దాడుల ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధర బ్యారెల్‌కు 94.74 డాలర్లకు చేరగా, బహ్రెయిన్, కువైట్‌పై జరిగిన దాడులను అమెరికా సైన్యం అడ్డుకున్నట్లు తెలిపింది.

Oil Prices

గ్లోబల్ మార్కెట్లో మరోసారి టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాలలో మళ్లీ గొడవలు రాజుకోవడంతో పాటు, ఇటు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు అనుకున్నట్లుగా సాగకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు(Oil Prices) వరుసగా మూడో రోజూ పెరిగాయి.

ఈ దెబ్బకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర(Oil Prices) ఒక శాతానికి పైగా పెరగడంతో.. బ్యారెల్‌ 94.74 డాలర్లకు రీచ్ అయింది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్, కువైట్ వంటి చోట్ల ఇరాన్ జరిపిన క్షిపణి దాడులను యూఎస్ సైన్యం అడ్డుకుందని, కొన్ని దాడులు ఫెయిల్ అయినట్లు యూఎస్ మిలిటరీ ప్రకటించింది. గత వారమే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఒక అంచనాకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందాలపైన కూడా సంతకాలు జరగకపోవడంతో మార్కెట్లో ఈ అనిశ్చితి నెలకొంది.

కాగా ఈ యుద్ధ భయాలు ఓవైపు ఫైనాన్షియల్ మార్కెట్లను కలవరపెడుతూ ఉంటే..మరోవైపు గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్ మాత్రం రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. జపాన్ కరెన్సీ అయిన యెన్‌తో పోలిస్తే డాలర్ వాల్యూ ఏకంగా 160 మార్కును తాకి రికార్డ్ సృష్టిస్తోంది.

అయితే దీనిలో జపాన్ ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందన్న భయంతో ట్రేడర్లు ప్రస్తుతం కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే బిట్‌కాయిన్ మాత్రం భారీగా పడిపోయింది.

పెద్ద పెద్ద హోల్డర్స్ తమ కాయిన్స్ అమ్మేస్తుండటంతో పాటు, పైగా వచ్చే వారం రాబోతున్న స్పేస్ ఎక్స్ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు క్యాష్ రెడీ చేసుకుంటూ ఉండటంతో బిట్‌కాయిన్ 3 రోజుల్లోనే సుమారు 10 శాతం నష్టపోయి, 2నెలల కనిష్ట స్థాయిలో 66,123 డాలర్లకు పడిపోయింది.

కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ.. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 75 బిలియన్ డాలర్లను వసూలు చేయడానికి ప్లాన్ చేస్తోంది.

ఇలాంటి క్రేజీ హాట్ హాట్ న్యూస్ మధ్య కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా మాత్రం మార్కెట్లో ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధ వాతావరణం ఉన్నా కూడా ఏఐ సపోర్ట్‌తో తైవాన్, జపాన్ దేశాల స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయికి చేరాయి.

ఎన్వీడియా బాస్ జెన్సన్ హువాంగ్.. మార్వెల్ టెక్నాలజీస్ కంపెనీని ఏకంగా నెక్స్ట్ ట్రిలియన్ డాలర్ కంపెనీ అని పొగడటంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 32.5 శాతం పెరిగాయి. ఈ ఏఐ పుణ్యమా అని జపాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న టయోటా కార్ల కంపెనీని వెనక్కి నెట్టి సాఫ్ట్‌బ్యాంక్ కూడా అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

Oil Prices

మరోవైపు అమెరికా ఎకానమీ రిపోర్ట్స్ ప్రకారం.. ఉద్యోగ అవకాశాలు ఈ ఐదేళ్లలో లేనంతగా అక్కడ పెరిగాయి. దీనివల్ల యూఎస్ ఫెడరల్ బ్యాంక్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలతో డాలర్ మరింత బలంగా అయ్యేలా కనిపిస్తోంది.

అమెరికాతో పాటు యూరప్, జపాన్ కూడా త్వరలోనే వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఒకవైపు గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంటే, మరోవైపు స్పేస్ ఎక్స్ ఐపీఓ హడావిడి మాయాజాలం, ఇంకోవైపు ఏఐ మ్యాజిక్‌తో గ్లోబల్ మార్కెట్ రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నట్లే కనిపిస్తోంది.

Jamun : నేరేడు పండ్లను ఈ సీజన్‌లో అస్సలు మిస్ చేయకండి..ఈ 3 బెనిఫిట్స్ తెలుసుకోండి..

Exit mobile version