Putin : 5 లక్షల సైనికుల సమీకరణ..పుతిన్ వ్యూహం వెనుక కారణమేంటి ?

Putin : పుతిన్ 5 లక్షల మంది సైనికుల సమీకరణ చేయబోతున్నట్టు గతంలో చాలాసార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

Putin

నాలుగేళ్లు సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో రెండు దేశాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేసిన పుతిన్ కూడా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. రష్యా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త సైనికులను సమీకరిస్తూ, కొన్ని సందర్భాల్లో తమకు దొరికిన వారినే బలవంతంగా పోరాటాలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికీ ఉక్రెయిన్ కంటే కూడా రష్యాకే ఎక్కువ మంది సైనికుల నష్టం వాటిల్లిందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కొత్త సైనికులను రిక్రూట్ చేసుకుంటూ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదంటున్నారు.

తాజాగా పుతిన్ దాదాపు 5 లక్షల మంది సైనికులను సమీకరించబోతున్నట్టు సమాచారం. సెప్టెంబర్లో జరగబోయే రష్యా పార్లమెంటరీ ఎన్నికల తర్వాత దీనిపై ప్రణాళికలు అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ రహస్య సమీకరణలపై దృష్టి పెట్టారు. యుద్ధంలో రష్యా సైనికుల నష్టాలను భర్తీ చేయడానికి, ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను తిప్పికొట్టడానికి మొదటి నుంచీ పుతిన్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

బహిరంగంగా ప్రకటన చేయకుండానే, షాడో కాంట్రాక్టులు ,సరిహద్దు నిబంధనల ద్వారా వందలాది మందిని సైన్యంలోకి తీసుకుంటున్నారు. దీనిపై స్వదేశంలోనూ వ్యతిరేకత వ్యక్తమైనా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భవిష్యత్తులో లక్షలాది మంది సైనికులను సమీకరించి కేవలం ఉక్రెయిన్‌కే కాకుండా ఐరోపా దేశాలకు హెచ్చరికగా ఉండేలా పుతిన్ పావులు కదుపుతున్నారు.

కాంట్రాక్ట్ సైనికులు, వాలంటీర్ల ద్వారానే ప్రస్తుత బలగాలను సమకూర్చుకుంటున్నామని రష్యా సైనిక అధికారులు చెబుతున్నా అసలు నిజం మాత్రం వేరే ఉంది. యుద్ధ తీవ్రత దృష్ట్యా అదనపు బలగాల కోసం మౌలిక సదుపాయాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

Putin

పుతిన్(Putin) 5 లక్షల మంది సైనికుల సమీకరణ చేయబోతున్నట్టు గతంలో చాలాసార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. తాజాగా మరోసారి ఆయన మాటలను గుర్తు చేస్తున్నారు. పుతిన్ వ్యూహం వెనుక ప్రధాన కారణం చూస్తే ఉక్రెయిన్‌పై పూర్తి విజయం సాధించడమేనని అర్ధం అవుతుంది.

అలాగే నాటో దేశాలపై ఒత్తిడి పెంచడం, అదే సమయంలో ఎలాంటి దీర్ఘకాలిక యుద్ధాన్నయినా తట్టుకునేలా పుతిన్(Putin) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమ లక్ష్యాలు నెరవేరే వరకు సైనిక చర్య కొనసాగుతుందని రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే చాలాసార్లు  స్పష్టం చేశారు.

Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?

Exit mobile version