Israel and Lebanon
మధ్య ప్రాచ్యంలో నెలకున్న వరుస ఉద్రిక్తతలకు టెంపరరీగా తెరపడుతూ, అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా పరస్పర దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ (Israel and Lebanon)దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక ఘట్టానికి అమెరికా వేదికైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ధ్రువీకరిస్తూ, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రెండు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ప్రాథమికంగా 10 రోజుల పాటు యుద్ధానికి స్వస్తి పలకడానికి అంగీకరించాయి. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ సానుకూలంగా రియాక్టయ్యారు.
అమెరికా రాజధానిలో 34 ఏళ్లలో రెండు దేశాల అగ్రనేతలు సమావేశమవ్వడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. అయితే ఈ 10 రోజుల కాల్పుల విరమణ కేవలం ఫ్రారంభం మాత్రమేనని, దీనిని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ శాంతి ప్రక్రియను పర్యవేక్షించడానికి ట్రంప్ తన అత్యున్నత స్థాయి బృందాన్ని రంగంలోకి కూడా దింపారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ రేజిన్ కేన్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది యుద్ధాలను పరిష్కరించడంలో తాను కీలక పాత్ర పోషించానని చెబుతున్న ట్రంప్, ఇది తన పదో విజయమని ఈ సందర్భంగా గర్వంగా ప్రకటించారు. లెబనాన్ పట్ల తనకున్న మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తూ, లెబనాన్ దేశం కోరిన విధంగా కాల్పుల విరమణను అమలు చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇక లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఈ పరిణామం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ట్రంప్ చూపుతున్న చొరవను లెబనాన్ అధ్యక్షుడు అభినందించారు.ఇజ్రాయెల్, లెబనాన్ (Israel and Lebanon) రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణ వివరాలను అమెరికా అఫీషియల్‌గా తమ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.
కాగా యుద్ధం వల్ల అతలాకుతలమైన సరిహద్దు ప్రాంతాల్లోని.. ప్రజలకు ఈ 10 రోజుల విరామం కూడా కొంత ఉపశమనాన్ని ఇస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టెంపరరీ ఒప్పందం భవిష్యత్తులో మధ్య ప్రాచ్య దేశాల మధ్య సుస్థిరమైన దౌత్య సంబంధాలకు పునాది వేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
US President Donald Trump posts on his Truth Social; "I just had excellent conversations with the Highly Respected President Joseph Aoun, of Lebanon, and Prime Minister Bibi Netanyahu, of Israel. These two Leaders have agreed that in order to achieve PEACE between their… pic.twitter.com/BHDDrkadr0
— ANI (@ANI) April 16, 2026
India and Russia:100 బిలియన్ డాలర్ల వాణిజ్యం దిశగా భారత్-రష్యా అడుగులు.. త్వరలోనే ఇండియాకు పుతిన్
