Tesla Roadster
సైన్స్ ఫిక్షన్ మూవీలలో ఆకాశంలో కార్లు ఎగురుతుంటే చూసి ఆశ్చర్యపోయే రోజులను, ఎంతో మంది కలలను నిజం చేసి చూపించాడు ఎలాన్ మస్క్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మెక్‌గ్రెగర్‌లో అక్టోబర్ 15వ తేదీన టెస్లా నిర్వహించిన ప్రదర్శన ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోయేలా చేస్తోంది.
సరికొత్త రోడ్‌స్టర్ కారును స్పెషల్ ర్యాంప్‌పై చాలా స్పీడ్‌గా నడిపించి, తలకిందులుగా తిప్పుతూ కొద్దిసేపు గాల్లో తేలియాడేలా చేయించిన విన్యాసాలు వావ్ అన్పించాయి . ఈ అద్భుతమైన స్టంట్ వీడియోను మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రాబోయే రోజుల్లో ఎగిరే కార్లు రోడ్లపైకి రావడం ఖాయమనే న్యూస్ చెబుతూ టెక్ లవర్స్‌లో పూనకాలు తెప్పించారు. అయితే ఇది కంట్రోల్డ్ కండిషన్స్‌లో చేసిన టెక్నికల్ ప్రదర్శన మాత్రమే.
ఈ రోడ్‌స్టర్(Tesla Roadster) వెనుక అసలైన మ్యాజిక్ ఏంటంటే.. స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీలోని కోల్డ్ గ్యాస్ థ్రస్టర్ సూత్రాన్ని ఫాలో అవడమే. కారు వెనుక భాగంలో అమర్చిన నాజిల్స్ ద్వారా హై ప్రెజర్‌తో గ్యాస్‌ను ఫాస్ట్‌గా బయటకు వదలడం ద్వారా కారు గాల్లోకి లేవడానికి అవసరమైన బూస్ట్ దొరుకుతుంది. కారులోని హై ప్రెజర్ గ్యాస్ ట్యాంక్, స్పెషల్ వాల్వులు ఈ మొత్తం ప్రాసెస్‌ను కంట్రోల్ చేస్తాయన్న మాట. అయితే ఈ టెక్నాలజీతో కారు ఎంత ఎత్తుకు ఎగరగలదు, డైలీ దీంతో జర్నీ చేయడం ఎంతవరకు సేఫ్ అనే అంశాలపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
2017లోనే ప్రకటించిన ఈ నెక్స్ట్ జనరేషన్ రోడ్‌స్టర్ ప్రొడక్షన్‌ను.. 2028లో ప్రారంభించాలని టెస్లా టార్గెట్‌గా పెట్టుకుంది. మార్కెట్లోకి రావడానికి చాలా స్ట్రిక్ట్ అండ్ సేఫ్టీ నిబంధనలు, ప్రభుత్వాల పర్మిషన్లు వంటి సవాళ్లు ఉన్నా కూడా, ఎలాన్ మస్క్ వేసిన ఈ ఆకాశపు అడుగు వెహికల్ వరల్డ్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందనే చెప్పాలి.
My OG Roadster is still orbiting Mars and Earth
— Elon Musk (@elonmusk) October 16, 2026
Parallel Conversations : బంధాలలో పారలల్ కాన్వర్సేషన్స్..మీ సంభాషణలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయా?
