Trump Birthright Citizenship : బర్త్ రైట్ రూల్‌కు బ్రేక్.. ట్రంప్ ఆర్డర్స్‌పై యూఎస్ కోర్ట్ కౌంటర్

Trump Birthright Citizenship : రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనబెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో బర్త్ రైట్‌ను తొలగించడం సాధ్యం కాదని ఇప్పుడు కోర్టు తెగేసి చెప్పింది.

Trump Birthright Citizenship

వరల్డ్‌లోనే అత్యంత శక్తివంతమైన డెసిషన్స్ తీసుకునే హోదా ఉన్నా కూడా, చట్టాల గీత దాటలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం విషయంలో అక్కడి న్యాయస్థానం మరోసారి ప్రూవ్ చేసింది.

అమెరికాలో అడుగుపెట్టి అక్కడే పిల్లలకు జన్మనిస్తే వాళ్లకు ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ ఇచ్చే అనాదిగా వస్తున్న నియమానికి చెక్ పెట్టడానికి ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్..తాజాగా కోర్టు గడప తొక్కి బోల్తా పడింది. ఇమ్మిగ్రెంట్స్ పిల్లల హక్కులను పరిమితం చేస్తూ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై అర్ధాంతరంగా స్టే విధిస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

యూఎస్ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ అక్కడి సిటిజన్‌షిప్ లభించడం వెనుక వందల ఏళ్ల నాటి బలమైన పునాది ఉంది. 1868లో అమల్లోకి వచ్చిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం చూస్తే.. పేరెంట్స్ ఏ కంట్రీ వారు అయినా సరే, వాళ్లు ఏ వీసాపై వచ్చి యూఎస్‌లో ఉన్నా కూడా అమెరికాలో పుడితే చాలు వాళ్లకు లీగల్‌గా అమెరికన్ పౌరుడి హోదా వస్తుంది.

అయితే బర్త్ టూరిజం పేరుతో విదేశీయులు దీనిని దుర్వినియోగం చేస్తున్నారనేది ట్రంప్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కేవలం తమ పిల్లలకు యూఎస్ పాస్‌పోర్ట్ దక్కాలనే ఆశతోనే..ఇతర దేశాల నుంచి గర్భిణులు విజిటర్ వీసాలపై వచ్చి అమెరికాలో ప్రసవిస్తున్నారని, ఇది తమ దేశ డెమోగ్రఫీని దెబ్బతీస్తోందని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాసెస్ మొత్తానికి ఎండ్ కార్డ్ వేయడానికే ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ముందుకు నెట్టారు.

అయితే, రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనబెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో ఈ హక్కును తొలగించడం సాధ్యం కాదని ఇప్పుడు కోర్టు తెగేసి చెప్పింది. నిజానికి ట్రంప్ టీమ్‌కు కోర్టుల్లో ఇలాంటి ఘోర పరాభవం ఎదురుకావడం ఇదే మొదటి సారి కాదు.

Trump Birthright Citizenship

ఇంతకుముందు కూడా నాన్-ఇమ్మిగ్రెంట్లు, టెంపరరీ వీసా హోల్డర్ల పిల్లలకు పుట్టుకతోనే సిటిజన్‌షిప్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం.. అత్యంత స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది.అయితే సుప్రీం తీర్పు ఉన్నా కూడా, బైపాస్ రూట్‌లో తన ఎగ్జిక్యూటివ్ పవర్స్‌ను వాడి సిటిజన్‌షిప్(Trump Birthright Citizenship) రూల్స్‌ మార్చాలని ట్రంప్ చేసిన ప్రయత్నం మళ్లీ మొదటికే వచ్చింది.

ఈ తాజా లీగల్ షాక్‌తో ట్రంప్ మార్క్ వలస విధానాలకు టెంపరరీగా పెద్ద బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది. రూల్స్ స్ట్రిక్ట్ చేసి వలసలను అడ్డుకోవాలని ట్రంప్ ఎంత గట్టిగా పావులు కదుపుతున్నారో.. అమెరికా రాజ్యాంగం కల్పించిన హక్కులు అంతే గట్టిగా, బలంగా , ఇంకా వేగంగా ఆయనకు ఎదురుగా నిలబడుతున్నాయి. ఏదేమైనా, కోర్టు ఇచ్చిన ఈ స్టే డెసిషన్.. లక్షలాది మంది ఎన్‌ఆర్‌ఐలకు, ఇతర దేశాల వలసదారులకు చాలా పెద్ద ఊరటగానే చెప్పొచ్చు.

Komic Village : ఆకాశానికి అత్యంత దగ్గరగా ఉన్న భారతీయ గ్రామం..15,050 అడుగుల ఎత్తులో మనుషులు ఎలా బతుకుతున్నారు?

Exit mobile version