Trump : అమెరికా వర్సెస్ ఇటలీ..చిచ్చు రేపిన ట్రంప్ కామెంట్స్

Trump : ఇటలీకి చెందిన ఓ టీవీ ఛానెల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే ట్రంప్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటిదురుసుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఇటలీ ప్రధానిని టార్గెట్ చేశారు. ట్రంప్(Trump) చేసిన కామెంట్స్ ఈ రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి ప్రతీసారీ చౌకబారు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటుంటారు. మరోసారి అలాంటి పరిస్థితే తెచ్చుకున్నారు.. ఇటలీకి చెందిన ఓ టీవీ ఛానెల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే ట్రంప్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

జీ7 సదస్సులో జార్జియా మెలోని తనతో ఫోటో దిగడానికి ఎంతో బ్రతిమాలిందంటూ వ్యాఖ్యానించారు. ఆమెకు తనతో ఫోటో దిగడం ఎంతగానో అవసరం ఉన్నట్టు కనిపించిందన్నారు. మెలోని పరిస్థితి చూసి జాలిపడి తాను ఫోటోకు అంగీకరించానని చెప్పారు.

అసలు తనకు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదనీ, అయినా కూడా మాట్లాడానని, దీనిపై ఆమె సంతోషంగానే ఉండి ఉంటుందని ట్రంప్(Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటలీకి చెందిన మంత్రులు ట్రంప్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని మండిపడుతున్నారు.

ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెంటనే కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ట్రంప్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానని చెప్పారు. తాను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరినీ ఎన్నడూ బతిమాలవు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Trump

అదే సమయంలో ట్రంప్ ను ఉద్దేశిస్తూ మరికొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల చూపించే సానుకూలత, ట్రంప్ తన మిత్రదేశాల పట్ల చూపించకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. కొన్ని నిమిషాల్లో మెలోని వర్సెస్ ట్రంప్ మధ్య ఈ మాటల యుద్ధం బాగా వైరల్ అయింది. దీంతో ట్రంప్ కామెంట్స్ ఎఫెక్ట్ అమెరికా, ఇటలీ దౌత్యసంబంధాలపై పడింది.

ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన రాబోయే అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ట్రంప్ పిచ్చి ప్రవర్తన అమెరికా, ఐరోపాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను నాశనం చేస్తోందని మెలోని ముఖ్య సలహాదారు ఫజోలారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

IND vs AFG : ఆఫ్గాన్‌కు క్లీన్ స్వీప్ గండం.. వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోగలదా?

Exit mobile version