Trump
ఇరాన్ తో యుద్ధంలో దాదాపుగా చేతులెత్తేసిన అమెరికా ఓటమిని అంగీకరించడం ఇష్టం లేకనే శాంతి మంత్రం జపించిందన్నది చాలా మంది అభిప్రాయం. ఇరాన్ సత్తాను తేలిగ్గా తీసుకున్న ట్రంప్ దానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. యుద్ధసామాగ్రి , మిస్సైల్స్ వంటి వాటి కోసం బిలియన్ డాలర్లు వెచ్చించింది.
అటు స్వదేశంలోనూ ట్రంప్ (Trump)తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ సమయంలో ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పుడు చైనా కాళ్లు పట్టుకుంటున్నారు. తాజాగా ట్రంప్ చైనా పర్యటన వెనుక అసలు సంగతి ఇదేనంటూ అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.
ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నిపుణుల అంచనా ప్రకారం. ట్రంప్ ఈ చైనా పర్యటనలో షీ జిన్‌పింగ్ ముందు రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇరాన్‌కు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వకుండా, ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండాలని చైనాను బతిమాలుతున్నారు. అలాగే చైనా పెద్దమనిషిగా జోక్యం చేసుకుని ఇరాన్ తో యుద్ధాన్ని ముగించడానికి సాయం చేయాలని రెండో ప్రతిపాదన పెడుతున్నట్టు సమాచారం.
దీంతో అంతర్జాతీయ పరంగా అమెరికా ఇమేజ్ మరింత దిగజారింది. అటు ట్రంప్ (Trump) కూడా చైనాను బతిమాలుకునే స్థాయికి దిగజారిపోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ అనవసర మాట పట్టింపులకు పోయి దేశ ఆర్థిక వ్యవస్థనే పణంగా పెట్టారు.
ఇరాన్ తో యుద్ధం కోసం అమెరికా ఖర్చు చేసిన మొత్తం చూస్తే దిమ్మతిరగాల్సిందే. భారత కరెన్సీ ప్రకారం చూస్తే యుద్ధం కోసం అక్షరాలా రూ.5.8 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిందట. ఆయుధాలు, మిలిటరీ సామగ్రి, మిసైల్స్ సప్లై కోసమే ఇంత మొత్తం తగలేసింది. దీంతో అమెరికా పౌరులే ట్రంప్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇంత భారీ మొత్తాన్ని విదేశీ యుద్ధాలపై ఖర్చు పెట్టడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే అక్కడి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో యుద్దాన్ని ఆపించే లక్ష్యంతోనే ట్రంప్ చైనా పర్యటనకు హడావుడిగా వెళ్లారు. యుద్ధాన్ని ఆపమని అడగడంతో పాటు మరోవైపు చైనాతో నడుస్తున్న ట్రేడ్ వార్ ను కూడా సెటిల్ చేసుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. దీని కోసమే మస్క్ లాంటి వ్యాపార పెద్దలను తీసుకుని వెళ్లారు. అయితే ట్రంప్ ప్రతిపాదనలకు జిన్ పింగ్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
