Trump : భారత్ కు రానున్న ట్రంప్..కీలక ఒప్పందాలు కుదిరేనా ?

Trump : ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు ట్రంప్ పర్యటన సందర్భంగా ఖరారయ్యే అవకాశముంది.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ అధికారిక ప్రకటన చేశారు. ట్రంప్(Trump) రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు ట్రంప్ పర్యటన సందర్భంగా ఖరారయ్యే అవకాశముంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేయడం, చైనాను కట్టడి చేసే వ్యూహాలపై ‘క్వాడ్’ దేశాల మద్దతు కూడగట్టడం కీలక ఒప్పందాల్లో ప్రధానంగా చెబుతున్నారు. అలాగే రక్షణ రంగ సహకారం, పెట్టుబడులతో పాటు అన్నింటికంటే ముఖ్యంగా వీసా విధానాల్లో కీలక పురోగతిలో చోటు చేసుకున్న మార్పులపై చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే ట్రంప్(Trump) పర్యటన ద్వారా భారత్ కు లభించే ప్రధాన ప్రయోజనాలను చూస్తే వాణిజ్య ఒప్పందాల్లో కీలకంగా ఉన్న కొన్ని తుది దశకు చేరుకునే అవకాశముంది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై రెండు దేశాలు కీలక ప్రకటనలు చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాణిజ్య ఒప్పందాలలో కీలకమైనవి కొలిక్కి వస్తే భారత్, అమెరికాల మధ్య ఎగుమతులు, దిగుమతులు మరింత సులభతరం కానున్నాయి.అలాగే రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉమ్మడి సైనిక విన్యాసాలు , ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణాకు ఉమ్మడిగా కృషి చేసేలా ఒప్పందాలు కుదురనున్నాయి.

ఇక చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్యులుగా ఉన్న క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఒక వేదికగా మారనుంది.ఇటీవల చైనాతో అమెరికాకు సంబంధాలు బెడిసికొట్టినట్టే కనిపిస్తున్నాయి. పలు చైనా కంపెనీలను అమెరికా బ్యాన్ చేయడమే దీనికి కారణం. ఈ సందర్భంగా క్వాడ్ కూటమి మద్దతు కోసం ట్రంప్ గట్టిగానే ప్రయత్నించే అవకాశముంది.

Trump

మరోవైపు పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యానికి సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, స్పేస్, ఇంధన రంగాలలో అమెరికా నుంచి భారత్‌కు భారీగా పెట్టుబడులు, సాంకేతిక సహకారం లభించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గ్లోబల్ లీడర్‌గా భారత్ ఎదిగేందుకు అమెరికా మద్దతు కూడా చాలా అవసరం.

అది లభిస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు దౌత్యపరమైన బలం చేకూరుతుంది. అయితే హెచ్1బీ వీసాలపై ఆంక్షలు ప్రత్యేకించి భారత్ విద్యార్థులను, ఉద్యోగులను టార్గెట్ చేసి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమైన సందర్భంలో దీనిపై ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడాలి.

Jonnagiri : బులియన్ మార్కెట్లో ఏపీ నుంచి తొలి బంగారు బిస్కెట్..మరి పసిడి ధరలు తగ్గుతాయా?

Exit mobile version