Gold Price
గోల్డ్ కొనాలనుకునే సామాన్యులకు, ఇన్వెస్టర్లకు ఈరోజు అదిరిపోయే శుభవార్త అందింది. కొంతకాలంగా దూసుకుపోయిన పసిడి, వెండి ధరలు నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గురువారంతో పోల్చుకుంటే ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ఏకంగా రూ. 1,590 వరకు కోత పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర(Gold Price) రూ.1 లక్ష 49వేల 500 మార్కుకు చేరుకుంది.
సాధారణంగా యుద్ధాలు ఆగిపోయాక, మార్కెట్లు పుంజుకుని ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు బంగారం ధరలు(Gold Price) పెరగడం కామన్. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం తర్వాత మళ్లీ పెరుగుతాయి అనుకున్న ధరలు ఇలా ఎందుకు పడిపోతున్నాయనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తోంది. ఇవి ఇలాగే ఉంటాయా రాబోయే రోజుల్లో మళ్లీ పెరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఆర్థిక మార్కెట్ల భాషలో చెప్పాలంటే పుత్తడిని సేఫ్ హెవెన్ (Safe Haven) సురక్షితమైన పెట్టుబడి అని పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. షేర్ మార్కెట్లు, కరెన్సీల విలువలు పడిపోతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లంతా తమ డబ్బును సేఫ్‌గా ఉంచుకోవడానికి స్టాక్ మార్కెట్ల నుంచి తీసేసి ..గోల్డ్‌పై పెట్టుబడి పెడతారు. సరిగ్గా అమెరికా, ఇరాన్ యుద్ధ భయం వల్ల అలా అందరూ ఒక్కసారిగా పసిడి కొనడం వల్ల డిమాండ్ పెరిగిపోయి రేట్లు ఆకాశాన్ని తాకాయి.
కానీ ఇరాన్-అమెరికా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత.. అంతర్జాతీయంగా యుద్ధ భయాలన్నీ పూర్తిగా వీడిపోయాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లలో మరలా స్థిరత్వం వస్తుందని ఇన్వెస్టర్లలో నమ్మకం బాగా పెరిగింది.
దీంతో ఇన్నాళ్లూ సేఫ్టీ కోసం బంగారంపై దాచిన పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసి.. ఎక్కువ లాభాలను ఇచ్చే స్టాక్ మార్కెట్లు, బాండ్లు, ఇతర వ్యాపారాల్లో పెట్టడం ప్రారంభించారు. మార్కెట్ భాషలో దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. బంగారానికి ఒక్కసారిగా ఇన్వెస్టర్ల మద్దతు, డిమాండ్ తగ్గడం వల్లే, అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరిస్తూ దేశీయంగా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పతనమయ్యాయి.
కాగా ఈ ధరల పతనం ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతుందా అనే ప్రశ్నపై మార్కెట్ విశ్లేషకులు తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. శాంతి ఒప్పందం వల్ల ఏర్పడిన ఇప్పటి సానుకూల ప్రభావం (Immediate Reaction) వల్ల ఈ 2,3 రోజులు ధరలు భారీగా తగ్గినా.. లాంగ్ టర్మ్‌లో మాత్రం పసిడి ధరలు మరీ పాతాళానికి పడిపోయే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం (Inflation), వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల కోసం కంటిన్యూగా గోల్డ్‌ను కొంటూనే ఉంటాయి.
కాకపోతే, రాబోయే రోజుల్లో ధరల్లో గతంలో జరిగినట్లుగా విపరీతమైన జంప్‌లు లేకుండా కాస్త అటూ ఇటుగా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ఉన్న వాళ్లకు , లాంగ్ టర్మ్ కోసం బంగారం కొనే వారికి ఈ సమయం కరెక్ట్ టైమ్ అని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, అమెరికా, ఇరాన్ యుద్ధం ఆగిపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా.. సామాన్యుడి పసిడి(Gold Price) కలలకు కూడా మంచి రోజులను తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు.
Mentor : కేవలం కష్టపడితే సరిపోదా? జీవితంలో ఒక మంచి మెంటార్ ఉండాల్సిందేనా?
