Mirai: విజువల్ వండర్ మిరాయ్..ఈ మూవీతో కోడి రామకృష్ణ వారసుడు వచ్చేసినట్లేనా?

Mirai: ఒక సినిమాని దర్శకుడు తలచుకుంటే పాన్ ఇండియాకాస్టింగ్ లేకపోయినా నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లొచ్చని నిరూపించాడు..కార్తీక్ ఘట్టమనేని.

Mirai

ఈ సినిమా ఆధ్యాత్మిక, మైథాలాజికాల్,అడ్వెంచర్, విజువల్ ఎఫెక్ట్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే కోడి రామకృష్ణ లేని లోటుని ఈ దర్శకుడు తీర్చాడు. ఒక సినిమాని దర్శకుడు తలచుకుంటే పాన్ ఇండియాకాస్టింగ్ లేకపోయినా నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లొచ్చని నిరూపించాడు..కార్తీక్ ఘట్టమనేని.ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యే కథ,ఇంటర్వెల్ వరకు టైట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగింది.ఇటువంటి స్క్రీన్ ప్లే అప్పటిలో అరుంధతిలోనే చూడగలిగాం. ఒక్కొక కథ ఒక్కో సూత్ర ఆధారంగా రాసుకుంటాం.

ఇక కథ(Mirai) విషయానికి వస్తే.. ఈ కథ “కారణ జన్మడు” సూత్రం ఆధారంగా సాగుతుంది. అప్పటిలో పాతాళ భైరవి & జగదేకవీరుని కథ జానపద చిత్రాల లో హీరో పాత్రలా ఇక్కడ కథానాయకుడి పాత్ర లోక రక్షకుడుగా తేజ సజ్జ  తన పాత్రతో పూర్తి న్యాయం చేశాడు.  ఈ సినిమా ప్రథమ అర్ధం లో వచ్చే ప్రతి నాయకుడి మంచు మనోజ్ ఫైట్స్ ను కూడా ప్రేక్షకులు అమితంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ & మొరాకో పోరాట ఘట్టాలు next లెవెల్ లో ఉన్నాయి.ముఖ్యం గా శబ్ద యంత్రాలు వాటి విజువల్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో వాడలేదు.

మంచు మనోజ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా ఈ ప్రతి నాయకుడి పాత్ర కి 100 % న్యాయం చేసింది. సినిమా ఇంటర్వెల్ ముందు ఈ కథనం అడ్వెంచర్ ఫిలింగా సాగుతున్నట్లు కనిపించినా.. దానిని తిరిగి ఇతిహాసాలతో కలపడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో సంపది పక్షితో చేసిన పోరాటాలు కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేశాయి.

స్టంట్ మాస్టర్ కేచ విజృంభణ సంకెళ్లు తెంచుకుంది అనేలా ఉన్నాయి యాక్షన్ ఘట్టాలు. ఈ సినిమాకి ప్రధాన ఆయువు పట్టు విజువల్ ఎఫెక్ట్స్.ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత నాణ్యత తో ఉన్న విజువల్ ఎఫెక్ట్ ఇండియన్ స్క్రీన్ పై రాలేదు.కథ & కథనంకి మించి విజువల్ ఎఫెక్ట్స్ వాడటంలో రాజ్ మౌళి దిట్ట. కానీ కథ,కథనం ,పాత్ర పరిధికి తగ్గట్లు విజువల్ ఎఫెక్ట్‌ను వాడటంలో కోడి రామకృష్ణ నిష్ణాతుడన్నది తెలిసిందే. ఈ కోవలోకి చేరుతాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. సినిమాటోగ్రాఫర్ కూడా తానే కావడం తో తన మదిలో దృశ్య కావ్యం ను స్క్రీన్ మీదకు అలా 100 % తెచ్చారు.

Uttara Falguni Karte: సెప్టెంబర్ 14 నుంచి ఉత్తర ఫల్గుని కార్తె ..దీని ప్రాముఖ్యత ఏంటి?

కథ (Mirai)పరంగా అనేక ప్రాంతాలు చూపవలసి వస్తుంది.దీనిలో భాగం గా ఆర్ట్ డైరెక్టర్ సినిమా ఫ్లో & థీమ్ ను కొనసాగించేలా స్పిరిచువల్ , ఆశ్రమాలు , సిద్ధక్షేత్రం ,అరబ్ , నేపాల్ నేటివిటీనీ చక్కగా డిజైన్ చేశారు.ముఖ్యం గా స్క్రీన్ కలర్ టోన్ లను సన్నివేశాలకు తగ్గట్లుగా నడిపించారు.ఇక కాస్ట్యూమ్ ల లో విలన్ మంచు మనోజ్‌వి ,హీరోయిన్ రీతికా, శ్రేయ పాత్రల కాస్ట్యూమ్ డిజైన్ అద్భతం గా ఉన్నాయి.ఇక మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి అయితే సినిమా మొదలైన 10 నిమిషాల్లో నే హాలీవుడ్ లెవెల్ BGM ఇచ్చారు. క్లైమాక్స్ BGMని.. మరింత విభిన్నంగా చూపి ఉంటే ఇంకా బాగుణ్ణు. ప్రోటగోనిస్ట్ గా హీరో తేజ పాత్ర చాలా సెటిల్ గా ఉంది.

కథ(Mirai)లో సింహభాగం మొత్తం ప్రభాస్ ,జగపతి బాబు ,శ్రేయ వాయిస్ ఓవర్ లతో నడిపించడం వలన సినిమా నిడివిని దర్శకుడు నియంత్రించి తను చూపించాలి అనుకున్న విజువల్ ట్రీట్ ను అద్భుత పోరాటాలతో ప్రేక్షకులను కట్టిపడేసాలా చేశారు. సెకండాఫ్ మొదట్లో కొంచెం స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తప్పినా సరే మళ్లీ విలన్ చిన్ననాటి ఎపిసోడ్ & శ్రేయ సజీవ తాంత్రిక దహనం ఎపిసోడ్ లతో ఘాడిలో పెట్టేశారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన నైపుణ్యం ను క్లైమాక్ ట్రైన్ ఎపిసోడ్ లోనూ ,హీరోయిన్ ఎక్స్ప్రెషన్ లను క్యాప్చర్ చేయడంలో అద్భుతంగా కట్ చేశారు.

Mirai

ఈ సినిమా మొత్తం మీద వందకి వంద శాతం పాత్రకి తగ్గ ఆహార్యంలో కనిపించింది సెయింట్ పాత్ర వేసిన రితికా.తను అవతల ఆర్టిస్ట్ హీరో పాత్ర చేసే వాటికి రివర్స్ ఇచ్చిన పాత్రోచిత ముఖ కవళికలు అద్భతం.సన్నివేశం ,కథలో మూలం ,సంభాషణకి అర్ధం తెలుసుకుంటే నే ఇటువంటి భావాలు ముఖం లో ఆర్టిస్ట్ పలికించగలరు ఈ లక్షణం అలవర్చుకున్న హీరోయిన్ రితిక నాయక్ ను చూస్తే భవిష్యత్ లో మంచి ఆర్టిస్ట్ అవుతారు అనిపిస్తుంది.

ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా మలచడంలో దర్శకుడు ఏ ఒక్క అంశం నీ నిర్లక్ష్యం చేయలేదు.చాలా రోజుల తరువాత డైరెక్ట్ గా చిన్న చిత్రం అద్భుతమైన కలెక్షన్ ల దిశగా దూసుకెళ్లగలిగే స్థాయి ఉన్న చిత్రం. ఇది కార్తీక్ ఘట్టమనేని నీ నెక్స్ట్ లెవెల్ డైరెకర్ గా తీసుకువెళ్లే చిత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీ కి సాలిడ్ హిట్ చిత్రాన్నీ అందిస్తుంది.అందరూ పాన్ ఇండియా స్టార్లు తీసుకొని కథ రాస్తారు.కానీ ఇక్కడ దర్శకుడు తను ఎంచుకున్న థీమ్ కి పాన్ ఇండియా కథ అయిన రామాయణంను ముడిపెట్టడంతో ఉత్తర భారత దేశంలో కూడా ఈ చిత్రం దూసుకెళుతోంది.

అన్నిటికి మించి చిన్న హీరో అయినా సరే ఇంత పెద్ద స్థాయి లో ప్రొడక్షన్ విలువలు ను మేకింగ్ లో రాజీ పడకుండా తెలుగు వారికి విజువల్ వండర్ పంచిన నిర్మాత విశ్వ ప్రసాద్ & కీర్తి అభినందనీయులు.ఇతిహాసాలు , చరిత్ర వంటి లాజిక్ లు వెతక్కుండా విజువల్ ట్రీట్ & యాక్షన్ థ్రిల్లర్ లను ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయగలిగే చిత్రం(Mirai) ఈ మిరాయి.

Review by Jai nivas

Health: మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లోనే!

Exit mobile version