Startup
స్టార్టప్(Startup) అంటే ఒక కొత్త ఆలోచనతో, వినూత్నమైన పరిష్కారంతో మొదలుపెట్టే ఒక యువ వ్యాపారం. ఈ స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే ముందుగా ఒక బలమైన వ్యాపార ఆలోచన (Business Idea) ఉండాలి. ఆ ఆలోచన ఏదైనా సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉండాలి.
ఉదాహరణకు, ఉబెర్ (Uber) లాంటి సంస్థలు రవాణా సమస్యకు, జొమాటో (Zomato) లాంటివి ఫుడ్ డెలివరీ సమస్యకు పరిష్కారం చూపాయి. మీ ఆలోచన ఎంత ప్రత్యేకంగా ఉందో, దానికి ఎంత మార్కెట్ ఉందో తెలుసుకోవడానికి మార్కెట్ రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ స్టార్టప్ విజయానికి మొదటి అడుగు.
తర్వాత, ఆ ఆలోచనను ఒక స్పష్టమైన బిజినెస్ ప్లాన్‌గా మార్చుకోవాలి. ఈ ప్లాన్‌లో మీ లక్ష్యాలు, ప్రణాళిక, వ్యూహాలు, పెట్టుబడుల అంచనాలు వంటివి ఉంటాయి. ఒక స్టార్టప్‌కు అతి ముఖ్యమైనది ఫండింగ్ లేదా పెట్టుబడి. మొదట్లో సొంత డబ్బుతో (Bootstrapping) ప్రారంభించినా కూడా, తర్వాత వ్యాపారాన్ని విస్తరించడానికి వివిధ దశలలో నిధులు సేకరించొచ్చు.
ఈ నిధులను ఏంజెల్ ఇన్వెస్టర్స్ (తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు) లేదా వెంజర్ క్యాపిటల్ సంస్థల (పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే సంస్థలు) నుంచి సేకరిస్తారు. స్టార్టప్ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదే. అలాగే స్టార్టింగ్‌లోనే సక్సెస్ వచ్చేయాలని ఆశలు పెట్టుకోకూడదు. సరైన టీమ్, పట్టుదల, వినూత్న ఆలోచనలు , కాస్తంత ఓపిక ఉంటే చాలు విజయం సాధించొచ్చు.
యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. ఉద్యోగాలు వెతుక్కోకుండా, స్వంతంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి స్టార్టప్(Startup) మార్గం గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వాలు కూడా మీ దగ్గర మంచి ఐడియా ఉంటే .. రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి.