Gold and silver:భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈ రోజు ఎంత తగ్గింది?
Gold and silver: ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల, రాబోయే వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold and silver
బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి, వెండి ధరల్లో తాజాగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధర (Gold Price Today) భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల, రాబోయే వారం రోజుల్లో బంగారం, వెండి (Gold and silver)ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం దేశవ్యాప్తంగా నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 540 తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ ప్రభావం కనిపించింది. ఔన్సు గోల్డ్‌పై ఏకంగా 15 డాలర్లు తగ్గడంతో, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,197 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఈ ధరల తగ్గుదల తెలుగు రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.

వెండి(Gold and silver) ధరల్లో మూడు రోజులుగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శనివారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. అంతకుముందు గురు, శుక్రవారాల్లో కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై మొత్తం రూ. 5,100 తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ కిలో వెండి ధర రూ.1,95,900 వద్దకు చేరింది. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో ఈ నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,90,000 వద్ద కొనసాగుతుంది.
ఈ ధరల పెరుగుదలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చెన్నైలో వెండి ధర రికార్డుల మోత మోగించడం. చెన్నైలోనూ కిలో వెండిపై రూ. 3,000 పెరగడంతో, అక్కడ కిలో వెండి ధర ఏకంగా రూ. 1,99,000 వద్దకు చేరింది. ఇది చెన్నై మార్కెట్‌లో ఒక రికార్డు స్థాయి ధరగా నిలిచింది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే, గోల్డ్, సిల్వర్ రేట్లు మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మారుతూ ఉంటాయని గమనించాలి.
Ravva Kesari: రవ్వ కేసరి..అందరి ఫేవరేట్ స్వీట్ ఎందుకయింది?



