Today Gold
కొద్దికాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోసుకున్న పరిణామాలతో పాటు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు,ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న ఉత్కంఠ బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 6, 2026) దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా క్షీణించడంతో.. కొనుగోలుదారులకు అనుకూలంగా మారాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,410 వద్ద కొనసాగుతోంది. గురువారం ధర రూ. 1,54,420 తో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,41,540 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ , విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల ధర రూ. 1,54,410 గాను, 22 క్యారెట్ల ధర రూ. 1,41,540 గాను నమోదైంది.
దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు బంగారం(Today Gold) ధరలు స్వల్ప వ్యత్యాసాలతో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,560 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,690 గా ఉంది. చెన్నైలో ధరలు మిగిలిన నగరాల కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ. 1,56,210 , 22 క్యారెట్ల ధర రూ. 1,43,190 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో హైదరాబాద్ లానే 24 క్యారెట్ల ధర రూ. 1,54,410 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,41,540 వద్ద కొనసాగుతున్నాయి.
పసిడి దారిలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర ఈరోజు రూ. 2,99,900 వద్ద ఉండగా.. ఇది గురువారం ధర రూ. 3 లక్షలతో పోలిస్తే వెయ్యి రూపాయల తగ్గుదలని చూపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నై , బెంగళూరులో కూడా కేజీ వెండి ధర దాదాపుగా ఇదే స్థాయిలో అంటే రూ. 2,99,900 వద్ద కొనసాగుతోంది.
అమెరికా డాలర్ బలోపేతం కావడంతో పాటు భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల ప్రభావం అంతర్జాతీయంగా ఈరోజు పసిడి(Today Gold) ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతుండటంతో డిమాండ్ తగ్గి ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందో లేదో అని కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గుదల మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మారింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
