Adrien Brody
ది పెయినిస్ట్(The Pianist) 2002 సినిమా తీసుకోండి. ‘వ్లాడిస్లావ్ స్పిల్‌మన్’ అనే యూదు సంగీత కళాకారుడి పాత్ర కోసం అతను ఏం చేశాడో తెలుసా? 30 పౌండ్లు బరువు తగ్గడం మామూలే. ఏకంగా 9 నెలల పాటు రోజూ నాలుగు గంటల పాటు పియానో ప్రాక్టీస్ చేశాడు. సినిమాలో మనం చూస్తున్నా వాయిద్య ప్రతిభలో ఎక్కువ భాగం బ్రాడీదే. క్లోజప్‌ల కోసం మాత్రమే అసలు మాస్టర్ (జానుస్ ఒలెజ్‌నిచాక్)Janusz Olejniczak చేతులను ఉపయోగించారు.
కానీ, మానసికంగా జీవించడానికి, తాను ఆ పాత్రలో బతకడానికి అతను ఏం చేశాడో వినండి . తన ఇంటిని అమ్మేశాడు, కారును పోగొట్టేశాడు, ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు, గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేశాడు. రెండు బాగ్లు, ఒక కీబోర్డ్‌తో యూరప్‌కు వెళ్లిపోయి, అజ్ఞాతంగా పూటకో పూట తింటూ, ఫుట్‌పాత్‌పై పాడుకుంటూ బతికాడు. ఇది అతను పాత్రలో పూర్తిగా లీనమవ్వాలనే తపనకు నిదర్శనం.
దీని ఫలితం? ఆయన వయసు 29 ఉండగానే బెస్ట్ యాక్టర్‌కి ఆస్కార్. ఇప్పటికీ ఆ రికార్డు బ్రేక్ కాలేదు.
ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే… ఇప్పుడు మరోసారి అతను ఆస్కార్ గెలుచుకున్నాడు. ది బ్రూటలిస్ట్(The Brutalist) అనే సినిమాతో. టైటిల్ చూసి మొదట “ఇదేమైనా రఫ్ యాక్షన్ డ్రామా అయితే చూద్దాం” అనుకున్నా… కానీ ఇది ఆలోచన కలిగించే ఎమోషనల్ జర్నీ. My Brutal Misunderstanding!
ఈ “బ్రూటలిజం” అనే పదమే అసలే తెలియక, థియేటర్లో నేను కూడా ఆశ్చర్యపోయా. టర్న్స్ అవుట్ బ్రూటలిజం అంటే ఒక ఆర్కిటెక్చర్ స్టైల్. ఫ్రెంచ్ పదం “béton brut” అంటే “raw concrete”. గోడలు, కాంక్రీట్ బల్కులే అసలైన డిజైన్ – రంగులు, అలంకారాలే లేవు. హైదరాబాద్‌లో కొత్తగా అట్టడుగుల మీదున్న ఆఫీసులు, హోటళ్ళు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి.
సినిమాలో బ్రాడీ చేసిన పాత్ర – హంగేరీకి చెందిన బ్రూటలిస్ట్ ఆర్కిటెక్ట్ లాజ్లో. హోలోకాస్ట్‌లో తన అన్నిటినీ కోల్పోయిన ఓ పేద కళాకారుడు, అమెరికా చేరుకుని తన కళ, తన కుటుంబం, తన కలల మధ్య నలిగిపోతూ చివరికి అమెరికన్ డ్రీమ్ సాధించే వరకు అతని జీవిత గాధ.
ఈ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాత్రకి (Adrien Brodyబ్రాడీ చేసిన నటన మరో మైలురాయి. $9.6 మిలియన్ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా $51 మిలియన్లు వసూలు చేసి, ఆస్కార్ అవార్డ్స్‌లో పది నామినేషన్లు కొట్టింది. అందులో మూడు గెలిచింది కూడా – బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ మ్యూజిక్ స్కోర్, మరియు బ్రాడీకి రెండో బెస్ట్ యాక్టర్ అవార్డు.
ఇది తట్టుకోలేని యాక్షన్ కాదు, తడబడించే ఎమోషన్. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన ఘర్షణలు, కళకు విలువ, జీవిత లక్ష్యాల కోసం తపన ఎంత దూరం తీసుకెళ్లొచ్చో చూపించే నిజమైన చిత్రం.
ఈ సినిమాని చూడాలి అనిపించేది, కథ కోసం కాదు. ఆడ్రియన్ బ్రాడీ (Adrien Brody0మళ్లీ ఎలా జీవించాడు అనేది చూడటానికే.
ఆడ్రియన్ బ్రాడీ నటన కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా.
Highly recommended for movie lovers.
#jiohotstar లో ఉంది.