Akhanda 2 : అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి స్ట్రీమింగ్ ఎప్పుడు?

Akhanda 2 : థియేటర్లలో రిలీజయిన కేవలం నాలుగు వారాలకే అఖండ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందన్న మాట.

Akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. అందుకే వీరిద్దరి హ్యాట్రిక్ కలయికలో వచ్చిన అఖండ 2 (Akhanda 2) తాండవం థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ, బాలయ్య కెరీర్‌లో 100 కోట్ల షేర్ మార్కును దాటి సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. కేవలం 22 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Akhanda 2

అయితే తాజా సమాచారం ప్రకారం, అఖండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుందట. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజయిన కేవలం నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందన్న మాట.

దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా తన నటనతో బాగా మెప్పించారు. తమన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరోవైపు బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాపై అప్పుడే దృష్టి సారించారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న ‘ఎన్బీకే 111’ సినిమా షూటింగ్ ఈమధ్య లాంఛనంగా ప్రారంభమైంది. దీనిలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ 2 ( Akhanda 2 ) ఇచ్చిన జోష్ తో ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

అఖండ 2 లోని డివోషనల్ కంటెంట్ , యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినా .. ఓటీటీలో మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బాలయ్య బాబు మూవీ ఓటీటీలో సందడి చేయడం అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పాలి.

Akhanda 2 Collections: అఖండ 2 కలెక్షన్స్ సునామీ .. బాక్సాఫీస్ వద్ద బాల‌య్య శివతాండవం!

Exit mobile version