Balakrishna
నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. సింహా, లెజెండ్ సినిమాలతో మొదలైన వీరి ప్రయాణం అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ స్థాయికి చేరింది. ఇటీవల విడుదలైన అఖండ 2 కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
అఖండ 2 ప్రమోషన్స్ సమయంలోనే బోయపాటి ఈ సిరీస్ లో ఐదారు సినిమాలు చేస్తామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా అఖండ 3 గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సినిమా అనేది అవెంజర్స్ రేంజ్ స్కోప్ ఉన్న కథ అని అభివర్ణించారు. హాలీవుడ్ లోని అవెంజర్స్ కేవలం రచయితల కల్పన మాత్రమేనని, కానీ మన దగ్గర పురాణాల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్ హీరోలు నిజంగానే ఉన్నారని ఆయన అన్నారు.
మన చరిత్ర నుండి ఎన్ని కథలనైనా, ఎంత మంది సూపర్ హీరోలనైనా తీసుకురావచ్చని, కానీ దానికి కావాల్సిన ఓపిక మరియు సంకల్పం ఉండాలని చెప్పారు. అఖండ 2 క్లైమాక్స్ లో శంబాలా తలుపులు తెరచుకోవడాన్ని చూపించామని, అఖండ 3 కథ సరిగ్గా అక్కడి నుండే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.
అయితే అఖండ 3 సినిమా కోసం అభిమానులు కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్ తీయడం కరెక్ట్ కాదని బోయపాటి అభిప్రాయపడ్డారు. మధ్యలో రెండు మూడు వేరే సినిమాలు చేసిన తర్వాతే మళ్ళీ బాలయ్య(Balakrishna)తో అఖండ 3 సినిమా చేస్తానని ఆయన తెలిపారు.
అంటే అఖండ 3 అనేది మరింత భారీ బడ్జెట్ తో, అత్యున్నతమైన గ్రాఫిక్స్ తో ఒక విజువల్ వండర్ లా ఉండబోతోందని అర్థమవుతుంది. బాలయ్య(Balakrishna) ఊరమాస్ నటనకు, బోయపాటి మార్క్ మేకింగ్ తోడవితే అఖండ 3 బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.
