Sanjana: విన్నర్‌కు షాక్ ఇచ్చే రేంజ్‌లో బిగ్ బాస్ 9 సంజన రెమ్యునరేషన్

Sanjana: షో మొదలైన కొత్తలో సంజన ప్రవర్తన చూసి ఆమె రెండో వారం లేదా మూడో వారంలోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు.

Sanjana

బిగ్ బాస్ సీజన్ 9 లో మరో ఆసక్తికరమైన పేరు సంజన గల్రానీ(Sanjana). నిజానికి షో మొదలైన కొత్తలో సంజన ప్రవర్తన చూసి ఆమె రెండో వారం లేదా మూడో వారంలోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. హౌస్ లో ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం , అందరి వస్తువులు దాచేయడం వంటి పనులతో ఆమె కంటెస్టెంట్లకు మరియు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

కానీ ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో ఆమె గ్రాఫ్ మొత్తం మారిపోయింది. నామినేషన్స్ టైమ్ లో డీమాన్ పవన్, రీతూల గురించి సంజన చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. ఆ విషయంలో హోస్ట్ నాగార్జున ఆమెను సారీ చెప్పమని కోరినప్పటికీ తాను తప్పు చేయలేదని మొండిగా నిలబడటం ఆమెకు ప్లస్ అయ్యింది.

తప్పు చేయనప్పుడు ప్రాణం పోయినా సారీ చెప్పను అంటూ సంజన (Sanjana)చూపించిన తెగువ ప్రేక్షకులకు నచ్చింది. దీంతో ఆమె ఓటింగ్ పెరిగి టాప్ 5 వరకు చేరుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంజన ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఆమె కేవలం టాప్ 5 లో నిలవడమే కాకుండా రెమ్యునరేషన్ లో కూడా రికార్డ్ సృష్టించింది.

Sanjana

15 వారాలకు గాను ఆమెకు మొత్తం 42 లక్షల రూపాయల వరకు పారితోషికం అందినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఆమెకు వారానికి సుమారు 2 లక్షల 80 వేల రూపాయలు చెల్లించారట. విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు అయితే సంజన కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే 42 లక్షలు వెనకేసుకుంది.

బిగ్ బాస్ చరిత్రలో ఒక కామనర్ లేదా చిన్న సెలబ్రిటీ ఇంత భారీ మొత్తం అందుకోవడం విశేషం. సంజన మాట మీద నిలబడటం వల్లే ఆమెకు ఈ గుర్తింపు, ఆదాయం దక్కిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version