Chief Guest: బిగ్ బాస్ ఫినాలే చీఫ్ గెస్ట్ చిరు కాదట.. మరి ఎవరంటే?

Chief Guest: బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దానితో పాటు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారనే దానిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.

Chief Guest

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇవాళ అనగా ఆదివారం డిసెంబర్ 21 రాత్రి జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్ విజేత ఎవరో ప్రపంచానికి తెలిసిపోతుంది. అయితే ఈ ఫినాలేలో విన్నర్ ఎవరనే దానితో పాటు చీఫ్ గెస్ట్ (Chief Guest)ఎవరు వస్తారనే దానిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.

మొదట మెగాస్టార్ చిరంజీవి వస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా ఆయనే విజేతకు ట్రోఫీని అందిస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ పేరు కూడా గట్టిగా వినిపించింది. ప్రభాస్ తన కొత్త సినిమా ది రాజా సాబ్ ప్రమోషన్ల కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు(Chief Guest) వస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు.

కానీ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ,ప్రభాస్ ఇద్దరూ ఈ ఫినాలేకు రావడం లేదు. చిరంజీవి తన పనులతో బిజీగా ఉండటం వల్ల ప్రభాస్ షూటింగుల వల్ల రాలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ టీం చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజను సంప్రదించిందని.. రవితేజ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

రవితేజ నటించిన భర్త మహశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారు. రవితేజ ఎనర్జీ గురించి మనకు తెలిసిందే ఆయన స్టేజ్ మీదకు వస్తే ఆ జోష్ వేరే లెవల్లో ఉంటుంది.

Chief Guest

ఇక ఈ ఫినాలే షూటింగ్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈసారి విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రైజ్ మనీతో పాటు విన్నర్‌కు కార్ , ఇతర బహుమతులు కూడా అందనున్నాయి.

రవితేజ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునే ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూడాలి. రవితేజ రాకతో ఫినాలే రేటింగ్స్ కూడా అదరిపోతాయని బిగ్ బాస్ టీం భావిస్తోంది. చిరంజీవి లేని లోటును రవితేజ తన మాస్ ఎనర్జీతో భర్తీ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version