Bigg Boss house
బిగ్ బాస్ తెలుగు 9 హౌస్(Bigg Boss house) పన్నెండవ వారంలో అడుగుపెట్టగా, శనివారం ఎపిసోడ్ నవ్వులు, తీవ్ర భావోద్వేగాలు, నాగార్జున స్టైల్ క్లాస్‌తో నిండిపోయింది. ఎప్పటిలాగే, హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్‌లకు చురకలు అంటించారు, ముఖ్యంగా ఇంట్లో పదే పదే జరుగుతున్న గొడవలకు కారణమైన కంటెస్టెంట్లపై దృష్టి సారించారు.
దివ్య – తనూజ ఫైట్‌పై నాగార్జున క్లాస్.. ఈ వారం హౌస్‌లో అత్యంత చర్చనీయాంశమైన విషయం దివ్య (Divya), తనూజ (Tanuja) మధ్య జరిగిన వాగ్వాదమే. కెప్టెన్సీ టాస్క్ నుంచి సాధారణ విషయాల వరకు వీరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ గొడవపై నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. ఇద్దరి ప్రవర్తనపై మిగతా హౌస్‌మేట్స్ అభిప్రాయాలు అడిగి, వారిద్దరినీ తమ వైఖరిని మార్చుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. ఈ తరహా నిరంతర గొడవలు ఆట యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ వారం నామినేషన్లలో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య డేంజర్ జోన్‌లో ఉండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుంచి దివ్యనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
తొలిసారి నామినేషన్లలోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్‌కు (Emmanuel) ప్రేక్షకుల నుంచి ఊహించని మద్దతు లభించగా, కల్యాణ్ (Kalyan) ఓటింగ్ చార్టులో మొదటి స్థానంలో నిలిచాడు. పవన్, భరణి సురక్షితంగా ఉండగా, సంజన (Sanjana), దివ్య డేంజర్ జోన్‌లో నిలిచారు.
కొన్ని వారాలుగా దివ్య ప్రవర్తన, ముఖ్యంగా తనూజతో తరచూ తగాదాలు పడటం ప్రేక్షకుల్లో ప్రతికూలతను (Negativity) పెంచింది. అదే సమయంలో, సంజనకు చివరి నిమిషంలో కొన్ని ఓట్లు మద్దతుగా రావడంతో, దివ్యకు అత్యంత తక్కువ ఓట్లు పోలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే, హౌస్‌లో కామనర్స్‌గా మిగిలేది కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. ఊహించినట్లుగా దివ్యనే నిష్క్రమిస్తుందా లేక చివరి నిమిషంలో ఎప్పుడూ ఉండే ట్విస్ట్ ఉంటుందా అనేది అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది.
ఇక ఈ(Bigg Boss house) వారం స్పెషల్ అట్రాక్షన్ ఫ్యామిలీ వీక్లో భాగంగా ప్రముఖ సినీ నటుడు నాగబాబు (Nagababu) స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌ను భావోద్వేగంతో నింపారు. ఆయనతో పాటు కంటెస్టెంట్ భరణి (Bharani) తల్లి కూడా రావడం భరణిని కంటతడి పెట్టించింది. తన గురువు, తన తల్లిని ఒకేసారి చూసిన భరణి, “దీనికంటే బెస్ట్ మూమెంట్ లేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.
నాగబాబు కూడా భరణి గురించి మాట్లాడుతూ, పాత సీరియల్స్ రోజుల నుంచి అతని అగ్రెసివ్ స్వభావాన్ని గుర్తు చేసుకున్నారు. “అప్పుడు భరణి చాలా అగ్రెసివ్… ఇప్పుడు బిగ్ బాస్ వల్ల గంగి గోవులా మారిపోయాడు! మరీ అంత సాఫ్ట్‌నెస్ అవసరం లేదు” అని సరదాగా చెబుతూనే, ప్రేక్షకులను నవ్వించారు.
నాగార్జున ఇచ్చిన ఫొటోలలో నాగబాబు, తనదైన శైలిలో టాప్ 5 కంటెస్టెంట్లుగా భరణి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజనలను ఉంచారు. ఆ తర్వాత సినిమా క్యారెక్టర్స్‌తో హౌస్‌మేట్స్‌ను మ్యాచ్ చేయమని అడగ్గా, నాగబాబు సరదాగా స్పందించారు:
గజినీ – భరణి: “ఏం చేయాలో తరచూ మర్చిపోతున్నాడని” సెటైర్ వేశారు.
హాసిని – రీతూ: “ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందంటూ, కొన్నిసార్లు ‘మాయాబజార్‌లో ఎస్వీ రంగారావు నవ్వినట్టుంది’ అని” జోకు చేసి నవ్వులు పూయించారు.
మొత్తంమీద, ఈ శనివారం(Bigg Boss house) ఎపిసోడ్ ఫ్యామిలీ బంధాలు, ఎలిమినేషన్ టెన్షన్, నాగార్జున-నాగబాబుల హాస్యంతో పూర్తి వినోదాన్ని పంచింది.
