Bigg Boss house: బిగ్‌బాస్ హౌస్‌లో డబుల్ షాక్: దివ్యను కాపాడిన తనూజ

Bigg Boss house: మొత్తం పది మంది నామినేషన్స్‌లో ఉన్న ఈ వారం, ఎలిమినేషన్ ప్రభావం ప్రధానంగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్‌పైనే పడింది.

Bigg Boss house

బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss house)తాజా సీజన్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. మొత్తం పది మంది నామినేషన్స్‌లో ఉన్న ఈ వారం, ఎలిమినేషన్ ప్రభావం ప్రధానంగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్‌పైనే పడింది. ఇప్పటికే శనివారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్ నాయర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్ కూడా హౌస్(Bigg Boss house) వీడాల్సి వచ్చింది.

గౌరవ్ మరియు నిఖిల్ ఇద్దరూ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టినా కూడా, వారి పారితోషికంలో (Remuneration) గణనీయమైన తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 12న వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌరవ్‌కు వారానికి రూ. 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన, ఐదు వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు ఆయన మొత్తం రూ. 7.5 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం ఆయన ‘గీత ఎల్ఎల్‌బీ’ అనే సీరియల్‌లో నటిస్తున్నారు.

అయితే గౌరవ్‌తో పాటు ఎలిమినేట్ అయిన నిఖిల్‌కు మాత్రం ఐదు వారాలకే రూ. 12 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. ఈ గణాంకాలు కంటెస్టెంట్ స్థాయి , ఒప్పందం ఆధారంగా పారితోషికంలో ఎంత తేడా ఉంటుందో స్పష్టం చేస్తున్నాయి.

ఆదివారం నాటి ఎలిమినేషన్ రౌండ్‌లో దివ్య, గౌరవ్ డేంజర్ జోన్‌లో చివరి వరకు నిలిచారు. చివరికి, ప్రేక్షకులనుంచి తక్కువ ఓట్లు పొందిన కారణంగా గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు, దివ్య సేఫ్ అయ్యింది.

అయితే, ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో తనూజ వద్ద ఉన్న సేవింగ్ పవర్ కీలక మలుపు తిప్పింది. ఈ వారం ఆ పవర్ ఎక్స్‌పైర్ అవుతున్న విషయాన్ని నాగార్జున ఆమెకు గుర్తుచేశారు. ఒకవేళ తనుజ తన సేవింగ్ పవర్‌ను ఉపయోగిస్తే, ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య తప్పనిసరిగా ఎలిమినేట్ అవుతుందని, అప్పుడు మాత్రమే గౌరవ్ సేఫ్ అవుతాడని నాగార్జున స్పష్టం చేశారు.

Bigg Boss house

దీనిపై కొంత సమయం ఆలోచించిన తనుజ, “ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్‌ను గౌరవిస్తున్నాను” అంటూ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్‌ను ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకుంది. తనుజ ఈ పవర్‌ను వినియోగించకపోవడంతో, ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం గౌరవ్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో దివ్య సేఫ్ అవ్వడంతో పాటు, ప్రేక్షకులకు ఈ నిర్ణయం పట్ల తనుజ యొక్క గౌరవం కూడా తెలిసింది.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌(Bigg Boss house)లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్‌ను ప్రేక్షకులు తక్కువ ఓట్లతో పంపించేశారు. తనుజ తీసుకున్న కఠినమైన నిర్ణయం ఈ ఎలిమినేషన్ రౌండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version