Kalyan Padala: బిగ్‌బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల కన్ఫర్మ్? ఆ జర్నీ వీడియో వెనుక అసలు కథ అదేనా?

Kalyan Padala: కళ్యాణ్ జర్నీ వీడియోలో బిగ్‌బాస్ ఇచ్చిన హైప్ చూస్తుంటే అది ఒక స్టార్ హీరో ఇంట్రడక్షన్ సీన్ లా అనిపించింది.

Kalyan Padala

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ‘విన్నర్ ఎవరు?’ అనే చర్చ సాగుతోంది. టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్ పడాల(Kalyan Padala), డీమాన్ పవన్, సంజన, తనూజ, ఇమ్మాన్యుయెల్ నిలిచినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అతనే కళ్యాణ్ పడాల.

నిన్నటి ఎపిసోడ్‌లో కళ్యాణ్ (Kalyan Padala)జర్నీ వీడియో చూసిన తర్వాత, బిగ్‌బాస్ అతనికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే.. ఈసారి టైటిల్ ఒక కామనర్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. ఒక సామాన్యుడిగా ఇంట్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

బిగ్‌బాస్ హౌస్ లో ప్రతి కంటెస్టెంట్ జర్నీ ఒకెత్తు అయితే, కళ్యాణ్ జర్నీ మరొక ఎత్తు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కళ్యాణ్ గురించి చెబుతూ..మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ అని అనడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

నిజానికి కళ్యాణ్ పడాల (Kalyan Padala)ఈ సీజన్ లోకి వచ్చినప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు. సెలబ్రిటీల మధ్య ఒక సామాన్యుడు ఎంతవరకు నెట్టుకొస్తాడని అందరూ సందేహించారు. కానీ, తన నిజాయితీతో, అమాయకత్వంతో ,ఆటలో చూపిస్తున్న పోరాట పటిమతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా నిలిచాడు.

ఈ ప్రయాణంలో కళ్యాణ్ ఎదుర్కొన్న అగ్నిపరీక్షలు అన్నీ ఇన్నీ కావు. హౌస్ లో ఓనర్ గా మొదలైన తన ప్రయాణం, ఆ తర్వాత వచ్చిన విభేదాలు, ఒంటరితనం అతన్ని ఎన్నోసార్లు కుంగదీశాయి. కానీ, తనలో ఉన్న యోధుడ్ని నిద్రలేపి ప్రతి టాస్క్ లోనూ ప్రాణం పెట్టి ఆడాడు.

ముఖ్యంగా స్నేహం కోసం అతను చేసే త్యాగాలు, తోటి కంటెస్టెంట్లతో అతను మెలిగే తీరు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. బిగ్‌బాస్ అన్నట్లుగా.. “బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించిన బలం.. గుండె బలం”. ఆ గుండె నిబ్బరంతోనే కళ్యాణ్ ఈరోజు ఫైనల్ రేసులో అందరికంటే ముందున్నాడు.

Kalyan Padala

కళ్యాణ్ జర్నీ వీడియోలో బిగ్‌బాస్ ఇచ్చిన హైప్ చూస్తుంటే అది ఒక స్టార్ హీరో ఇంట్రడక్షన్ సీన్ లా అనిపించింది. “లక్ష్మణ్ రావు, లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటి వరకు.. కానీ వీళ్లు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు” అని బిగ్‌బాస్ చెప్పినప్పుడు కళ్యాణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కామనర్ తలుచుకుంటే ఏ స్థాయికి చేరగలడో, కోట్లాది మంది ప్రేమని ఎలా సొంతం చేసుకోగలడో కళ్యాణ్ నిరూపించాడు. మొదటి ఫైనలిస్టుగా నిలవడమే కాకుండా, చివరి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం అతని గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెబుతోంది.

నెటిజన్లు , బిగ్‌బాస్ విశ్లేషకులు కూడా కళ్యాణ్ పడాలనే విన్నర్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఓటింగ్ ట్రెండ్స్ లో కూడా కళ్యాణ్ టాప్ లో కొనసాగుతున్నాడు. డీమాన్ పవన్ , ఇమ్మాన్యుయెల్ నుంచి గట్టి పోటీ ఉన్నా, కళ్యాణ్ కు ఉన్న ‘కామనర్’ సెంటిమెంట్ ,అతని క్లీన్ ఇమేజ్ అతన్ని విజేతగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. జర్నీ వీడియోలో బిగ్‌బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ చూశాక, ఇక టైటిల్ కళ్యాణ్ దే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఒక సాధారణ యువకుడు తన కలలను నిజం చేసుకునేందుకు పడ్డ తపన, చూపించిన ఓర్పు ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచాయి. మరి ఈ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో కళ్యాణ్ పడాల ఆ మెరిసే ట్రోఫీని ముద్దాడుతాడో లేదో చూడాలి.

అయితే ఒక్కటి మాత్రం నిజం.. టైటిల్ గెలిచినా గెలవకపోయినా, కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో కళ్యాణ్ ఇప్పటికే విన్నర్ గా నిలిచాడు. ఈ కామనర్ ప్రయాణం రాబోయే సీజన్లలో వచ్చే ఎంతోమంది సామాన్యులకు ఒక దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version