Bigg BossJust EntertainmentLatest News

Danger zone: డేంజర్ జోన్‌లోకి స్టార్ కంటెస్టెంట్..బిగ్ బాస్ 9లో టాప్-5కు చేరేది ఎవరు?

danger zone: ఈ వారం ఎలిమినేషన్స్ కోసం ఆరుగురు కంటెస్టెంట్స్ (తనూజ, డిమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ) నామినేషన్స్‌లో ఉండగా, ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి.

Danger zone

బుల్లితెర ప్రేక్షకులను మూడు నెలలుగా అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో దాదాపుగా తుది అంకానికి చేరుకుంది. హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉండగా, మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో సోషల్ మీడియాలో విన్నర్, రన్నర్, టాప్ 5 ఫైనలిస్ట్‌లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్స్ కోసం ఆరుగురు కంటెస్టెంట్స్ (తనూజ, డిమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ) నామినేషన్స్‌లో ఉండగా, ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి.

danger zone
danger zone

ఈ వారం నామినేషన్స్ ఫలితాలు ప్రేక్షకులను, బిగ్ బాస్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఎప్పటిలాగే తనూజ తన స్థానాన్ని పదిలపరుచుకుని, ఓటింగ్‌లో దూసుకుపోయింది. ఆమెకు ఎక్కువ శాతం ఓట్లు పడి, టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. తనూజ తర్వాత స్థానం రీతూ చౌదరిదే, ఆమె ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరగడం గమనార్హం. ముఖ్యంగా, మొన్నటివరకు లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నట్లు కనిపించిన భరణి శంకర్ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని, టాప్-3లోకి వచ్చేశాడు. ఈ వారం అతను చూపించిన పోరాట పటిమ అభిమానులను ఆకర్షించినట్లు కనిపిస్తోంది.

danger zone
danger zone

ఓటింగ్ సరళిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొన్నటివరకు టాప్-3లో ఉన్నట్లు అంచనా వేయబడిన సంజనా గల్రానీ ఇప్పుడు ఊహించని విధంగా డేంజర్ జోన్‌(danger zone)లోకి పడిపోయింది. ఈ వారం టాస్క్‌లలో ఆమె గట్టిగానే పోరాడినా కూడా, ఇది ఆమె ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చివరి స్థానాల్లో కొనసాగుతుంది.

biggboss
biggboss

ఇక నాలుగో ప్లేస్‌లో డిమాన్ పవన్ ఉండగా, ఐదో పొజిషన్‌లో సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి, సంజన గల్రానీకి మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉన్నా, ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్(danger zone) అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

danger zone
danger zone

ప్రస్తుత ట్రెండింగ్స్ , కంటెస్టెంట్స్ యొక్క ప్రదర్శనలను బట్టి చూస్తే, మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. హౌస్‌లో మిగిలిన వారిలో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, భరణి శంకర్ లు టాప్ 5లో నిలవడానికి బలమైన పోటీదారులుగా ఉన్నారు. ఈ జాబితాలో డిమాన్ పవన్‌కు కూడా ఛాన్స్ ఉంది, అయితే దీనికోసం అతను రాబోయే వారాల్లో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుని, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button