Winner: బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో ఫిక్స్ అయిపోయినట్లేనా?

Winner: ఓటింగ్ ముగియడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఫలితాలు మారే అవకాశం కూడా ఉంది.

Winner

బుల్లితెర ప్రేక్షకులను మూడు నెలలుగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ లో ఎంతో మంది కంటెస్టెంట్స్ వచ్చారు, గొడవలు పడ్డారు, టాస్క్ లలో గెలిచారు.

చివరకు తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్ సంజన ఐదుగురు మాత్రమే ఫైనల్ కి చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఆ కిరీటాన్ని ఎవరు గెలుచుకుంటారు? ప్రైజ్ మనీ ఎవరికి దక్కుతుంది? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్ పైన ఉంది.

Winner

ప్రస్తుతం బయటకు వస్తున్న ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే కళ్యాణ్ పడాల టైటిల్ రేసులో చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ , ఆయన ఫ్యాన్స్ చేస్తున్న క్యాంపెయిన్ వల్ల ఆయనకు భారీగా ఓట్లు పడుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్ అఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ కు 38 శాతం ఓట్లు వచ్చాయి.

Winner

ఆయన తర్వాత స్థానంలో తనూజ నిలిచింది. ఈసారి ఎలాగైనా ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్ (Winner)కావాలని తనూజ అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తనూజకు సుమారు 32 శాతం ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ కు, తనూజకు మధ్య పోటీ చాలా గట్టిగా ఉన్నా, ప్రస్తుతం కళ్యాణ్ దే పైచేయిగా కనిపిస్తోంది.

ఇక డిమోన్ పవన్ మూడో స్థానంలో ఉండగా, ఇమ్మూ నాలుగో స్థానానికి పడిపోయాడు. సంజన ఐదో స్థానంలో ఉంది. ఓటింగ్ ముగియడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఫలితాలు మారే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే మాత్రం కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్(Winner) అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని బిగ్ బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version