Chiru and Prabhas
సంక్రాంతి పండుగ అనగానే థియేటర్ల దగ్గర హడావిడి, ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG), రెబల్ స్టార్ ప్రభాస్ (Chiru and Prabhas) ‘ది రాజాసాబ్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే మొదలవబోతోంది.
అయితే, కొద్ది రోజులుగా పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుపై తెలంగాణలో (Telangana ) పెద్ద వివాదమే నడిచింది..నడుస్తోందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరటే లభించింది. టికెట్ ధరల పెంపుపై గతంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో,ఇక సంక్రాంతి సినిమాల రేట్లపై క్లారిటీ వచ్చేసింది.
గతేడాది ‘పుష్ప-2’, ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ-2’ వంటి మూవీల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోలు (GOs) ఇచ్చి టికెట్ ధరలు(Ticket Price Hike) భారీగా పెంచుకునే అవకాశమిచ్చింది. కొన్ని చోట్ల టికెట్ ధరలు రూ. 600 నుంచి రూ. 1200 వరకు వెళ్లడంతో సామాన్య ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు.
దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో, సింగిల్ బెంచ్ జడ్జి స్పందిస్తూ.. ప్రతి సినిమాకు ఇలా రొటీన్‌గా రేట్లు పెంచడం పబ్లిక్ ఇంటరెస్ట్‌కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఇప్పుడు రాబోయే సంక్రాంతి సినిమాలకు కూడా రేట్లు పెరగవేమో అన్న టెన్షన్ నిర్మాతల్లో మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి , డార్లింగ్ ప్రభాస్ (chiru and Prabhas) చిత్రాల నిర్మాతలు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ కీలక క్లారిటీని ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కేవలం ‘పుష్ప-2’, ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ-2’ చిత్రాలకు మాత్రమే పరిమితమని క్లారిటీ ఇచ్చింది.
అంటే, ఆ పాత తీర్పును సాకుగా చూపి కొత్త మూవీల టికెట్ పెంపును ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇది నిర్మాతలకు లీగల్ గా పెద్ద ‘రోడ్ బ్లాక్’ తొలగించినట్లయింది. అయితే, టికెట్ ధరలు ఎంత పెంచాలి అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, తాము హోంశాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు చెప్పింది.
ఇప్పుడు కోర్టు నుంచి లీగల్ అడ్డంకులు తొలగినా.., అసలైన నిర్ణయం ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల్లో ఉన్నట్లు అయింది. టికెట్ రేట్లు పెంపు కోసం తమ దగ్గరకు రావొద్దు, ప్రజలపై భారం వేయనివ్వమని ఆయన ఇప్పటికే కఠినంగా చెప్పారు.
ముఖ్యంగా పుష్ప-2 టైములో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోల పట్ల రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. మరి ఇప్పుడు కోర్టు క్లారిటీ ఇచ్చేయడంతో, సంక్రాంతి పెద్ద సినిమాలకు ప్రభుత్వం ఎంత వరకు వెసులుబాటు ఇస్తుంది? ఫ్యాన్సీ రేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేకపోతే పరిమితమైన పెంపుతోనే సరిపెడుతుందా అనేది తెలియాలి.
Bail: ఐబొమ్మ రవికి నో బెయిల్.. జైలు గడప దాటనివ్వని ఆ మూడు కారణాలివే..
