Ibomma Ravi: ఐబొమ్మ రవి వాంగ్మూలం.. బయటపడిన హ్యాకింగ్ విషయాలు

Ibomma Ravi :ఎంతో సురక్షితమైనదని భావించే క్యూబ్ (Qube) నెట్‌వర్క్‌ను కూడా తాను హ్యాక్ చేశానని రవి ఒప్పుకోవడం అధికారులను షాక్‌కు గురిచేసింది.

Ibomma Ravi

తెలుగు సినీ ఇండస్ట్రీని గడగడలాడిస్తున్న పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వహకుడు రవి(Ibomma Ravi) విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పోలీసుల కస్టడీలో ఉన్న రవి, తను ఎంత పెద్ద ఎత్తున పైరసీకి పాల్పడేవాడో విచారణలో వివరించాడు.

ఎంతో సురక్షితమైనదని భావించే క్యూబ్ (Qube) నెట్‌వర్క్‌ను కూడా తాను హ్యాక్ చేశానని రవి ఒప్పుకోవడం అధికారులను షాక్‌కు గురిచేసింది. కేవలం వెబ్ సైట్ నడపడమే కాకుండా, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసి సినిమాలను హై డెఫినిషన్ (HD) క్వాలిటీలో రికార్డ్ చేసేవాడట.

తాజాగా విడుదలైన ‘హిట్-3’, ‘కిష్కిందపురి’ వంటి సినిమాలను కూడా తాను శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేశానని అతడు అంగీకరించాడు.పైరసీ చేసిన ఈ సినిమాలను షేర్ చేయడానికి టెలిగ్రామ్ వేదికగా ‘హెచ్‌డీ హబ్’ పేరుతో ఒక ఛానల్‌ను నడుపుతూ, అక్కడి నుంచి లింకులను పంపిస్తూ 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.

Ibomma Ravi

రవిని చంచల్‌గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం మూడు కేసులకు సంబంధించి 12 రోజుల పాటు విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతి కేసులోనూ నాలుగు రోజుల పాటు లోతైన విచారణ జరగనుంది.

సినిమా థియేటర్లలో కంటే ముందే హై క్వాలిటీ ప్రింట్లు ఎలా వస్తున్నాయనే మిస్టరీ రవి వాంగ్మూలంతో వీడిపోయింది. కేవలం విదేశీ సర్వర్ల సాయంతో మాత్రమే కాకుండా, లోకల్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ దందాను నడిపించినట్లు స్పష్టమైంది. ఈ కేసులో మరిన్ని నెట్‌వర్క్ హ్యాకింగ్ మూలాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version