Photos: రామ్ చరణ్ పెద్ది సినిమా లీక్డ్ ఫోటోల రచ్చ

Photos: రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను బుచ్చిబాబు చిత్రీకరిస్తున్నారు.

Photos

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ప్రస్తుతం పెద్ది సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్‌గా నిలిచింది. ఈ సాంగ్ ఇచ్చిన ఊపుతో సినిమా షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను బుచ్చిబాబు చిత్రీకరిస్తున్నారు.

అయితే షూటింగ్ స్పాట్ నుంచి రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు(Photos) తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ చేతిలో ఒక సంచితో చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతోంది.

Photos

ఒక్క ఫోటోతో(Photos)నే సినిమాపై హైప్ డబుల్ అయిపోయింది. గేమ్ ఛేంజర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version