Samantha’s Fitness: సమంత ఫిట్‌నెస్ సీక్రెట్స్..శామ్ చెప్పిన బ్యాలెన్స్ మంత్రం మీరూ ఫాలో అయిపోండి

Samantha's Fitness: సమంత వారంలో నాలుగు నుంచి ఐదు సార్లు జిమ్‌కి వెళ్తుంది. సమంత దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఏదో కష్టం అనుకుని పర్ఫెక్ట్‌గా చేయాలని రూల్ లేదని.. రోజు తప్పకుండా రావడం ముఖ్యం అంటుంది శామ్.

Samantha’s Fitness

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. తన స్టైల్, నటనతో ఎంత పాపులరో, అంతకు మించి తన ఫిట్‌నెస్‌(Samantha’s Fitness)తో కూడా ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. తను ఎప్పుడూ చాలా ఫిట్‌గా, స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. ఈ ఫిజిక్ వెనుక ఉన్న తన లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ ఏంటనేది రీసెంట్‌గా న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ ర్యాన్ ఫెర్నాండోతో మాట్లాడినప్పుడు సమంత పంచుకుంది.

సమంత వారంలో నాలుగు నుంచి ఐదు సార్లు జిమ్‌కి వెళ్తుంది. సమంత దృష్టిలో ఫిట్‌నెస్(Samantha’s Fitness) అంటే ఏదో కష్టం అనుకుని పర్ఫెక్ట్‌గా చేయాలని రూల్ లేదని.. రోజు తప్పకుండా రావడం (Consistently showing up) ముఖ్యం అంటుంది శామ్.

ప్రతి సెషన్‌ను తన శరీరం ఆ రోజు ఎలా కోరుకుంటే, దానికి తగ్గట్టుగా కొద్దిగా మార్చుకుంటుంది. ఎక్స్‌ట్రీమ్ గోల్స్ వెంట పడకుండా, చిన్న ప్రయత్నం అయినా సరే, రోజూ ఏదో ఒకటి చేయడంపైనే ఫోకస్ చేస్తుంది.

Samantha’s Fitness

ఆమె ప్లాన్‌లో స్ట్రెంత్ ట్రైనింగ్ (బరువులు ఎత్తడం), మైండ్‌ను గ్రౌండింగ్ చేసే యోగా, బాడీ మూమెంట్‌ను పెంచే ఫంక్షనల్ ఎక్సర్‌సైజులు(Samantha’s Fitness), ముఖ్యంగా మైండ్‌ఫుల్ శ్వాస (Mindful Breathing) ఉంటాయి. ఇవి తన బాడీని ఎప్పుడూ యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంచుతాయి.

సమంత హెల్త్ ఇష్యూస్ (ఆరోగ్య సమస్యలు) వచ్చినప్పుడు, కోలుకునే జర్నీలో స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా కీలకంగా మారింది. ముందుగా చాలా జాగ్రత్తగా, నిపుణుల సలహాలతోనే మళ్లీ స్టెబిలిటీని, కండరాల బలాన్ని తిరిగి పెంచుకోవడం మొదలుపెట్టింది.

ఇప్పుడు తన వర్కవుట్‌లలో స్క్వాట్స్, రెసిస్టెన్స్-బ్యాండ్ డ్రిల్స్, సొంత శరీర బరువుతో చేసే ఎక్సర్‌సైజులు ఉంటాయి. ఈ పద్ధతి వల్ల ఫిజికల్ పవర్ తిరిగి రావడమే కాకుండా, తనలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని సమంత చెప్పింది.

తను వారంలో ఐదు నుంచి ఆరు రోజులు ఉదయం పూట మాత్రమే వర్కవుట్ చేస్తుందట. దీనికి .. ఉదయాన్నే వర్కవుట్ చేయడం వల్ల రోజంతా మూడ్ చాలా బాగా సెట్ అవుతుంది. మంచి హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. మిగతా రోజు మొత్తం ఎనర్జీగా ఉండగలుగుతానని శామ్ చెప్పింది

యోగా, శ్వాస నియంత్రణ (ప్రాణాయామం) సమంతకు కేవలం అదనపు ఎక్సర్‌సైజులు కావు, అవి తన డైలీ ఫౌండేషన్ అంటుంది తను.

స్ట్రెస్ మేనేజ్ చేయడానికి, త్వరగా కోలుకోవడానికి,మానసిక ఏకాగ్రత (Mental Clarity) కోసం ఆమె ప్రాణాయామంపై ఆధారపడుతుంది.

Samantha’s Fitness

తనకు చాలా కష్టమైన అనారోగ్య దశలో ఈ శ్వాస టెక్నిక్స్‌ బాగా పనిచేశాయని, ఇప్పుడు అది తన రోజువారీ ఆచారంగా (Daily Ritual) మారిందని సమంత చెప్పింది.

సమంత ఎప్పుడూ తన లిమిట్స్ దాటి కష్టపడటానికి ఇష్టపడదు. తన హార్మోనల్ సైకిల్స్, ఎనర్జీ లెవెల్స్‌ను బట్టి వర్కవుట్‌లను మారుస్తుంది.కొన్ని రోజులు శక్తి తక్కువగా అనిపిస్తే, కేవలం స్ట్రెచింగ్ లేదా ఎక్కువ దూరం నడవడాన్ని ఎంచుకుంటుంది.

ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందో, అప్పుడే వెయిట్ ట్రైనింగ్ చేస్తుంది. ఈ తెలివైన పద్ధతి వల్ల తను త్వరగా అలిసిపోకుండా ఉండగలుగుతుంది, ఎక్కువ కాలం ఫిట్‌నెస్‌(Samantha’s Fitness)ను కంటిన్యూ చేయగలుగుతుంది.

తను తినే ఆహారం కూడా తన రొటీన్‌లో చాలా ముఖ్యం. సమంత యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం శరీరంలో అనవసరమైన వాపు (Inflammation) తగ్గించడం.

ఈ డైట్‌లో ఎక్కువగా హెల్తీ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఫైబర్, మంచి ఫ్యాట్స్, క్వాలిటీ ప్రోటీన్ ఉంటాయి.

తన భోజనంలో పసుపు, అల్లం, ఆకుకూరలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న పండ్లు ఎక్కువగా ఉంటాయి. తనను పరిమితం చేసే ఆహారాల కంటే, తన శరీరానికి సపోర్ట్ ఇచ్చి, పోషణనిచ్చే ఫుడ్‌నే తను ఎంచుకుంటుందని చెప్పుకొచ్చింది శామ్.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version